• Home »
  • Cable »
  • మరో 27 డిజిటల్ ఎమ్మెస్వో లైసెన్సులు

మరో 27 డిజిటల్ ఎమ్మెస్వో లైసెన్సులు

సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ మరో 27 డిజిటల్ ఎమ్మెస్వో లైసెన్సులు మంజూరు చేసింది.  దీంతో ఇప్పటివరకు మొత్తం 451 తాత్కాలిక లైసెన్సులు మంజూరు చేసినట్టయింది. పుదుచ్చేరికి చెందిన విశ్వం డిజిటల్ నెట్ వర్క్ మాత్రమే యావత్ భారతదేశానికి లైసెన్స్ తీసుకుంది. మిగిలినవన్నీ రాష్ట్రస్థాయి లేదా జిల్లా స్థాయి ఎమ్మెస్వోలు మాత్రమే. ఈ జాబితాలో శాశ్వత లైసెన్స్ ఒక్కటి కూడా లేదు.

లైసెన్స్ పొందిన ఇతర ఎమ్మెస్వోలు ఆంధ్రప్రదేశ్, చత్తీస్ గఢ్, మధ్య ప్రదేశ్, రాజస్థాన్, జమ్మూకాశ్మీర్, ఒడిశా, తమిళనాడు, కేరళ, మహారాష్ట్ర, మణిపూర్, హర్యానా రాష్ట్రాల్లో డిజిటల్ కేబుల్ కార్యకలాపాల కోసం అనుమతి పొందారు. ఒడిశాకు చెందిన న్యూ మిలీనియం నెట్ వర్క్ ఒడిశాలోని గంజాం, గజపతి, ఖుర్దా, రాయగడ జిల్లాలతోబాటు ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళం జిల్లాకు కూడా లైసెన్స్ తీసుకుంది