• Home »
  • Data & Projections »
  • 12 శాటిలైట్ చానల్ లైసెన్సు దరఖాస్తులను తోసిపుచ్చిన ప్రభుత్వం

12 శాటిలైట్ చానల్ లైసెన్సు దరఖాస్తులను తోసిపుచ్చిన ప్రభుత్వం

సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ తాజా జాబితా ప్రకారం అప్ లింకింగ్, డౌన్ లింకింగ్ లైసెన్సులు పొందిన మొత్తం చానల్స్ సంఖ్య 869 కి చేరింది. అయితే,  లైసెన్సు రద్దయిన చానల్స్, స్వయంగా ఉపసంహరించుకున్న  చానల్స్ పోను నికరంగా మిగిలిన చానల్స్ సంఖ్య ఇది.  నిజానికి ఇప్పటివరలు లైసెన్స్ జారీ అయిన చానల్స్ సంఖ్య 1007. వాటిలో ఇప్పటివరకు 126 వివిధ కారణాలవలన  లైసెన్సులు రద్దయ్యాయి.  వాటిలో తెలుగులో సత్య టీవీ, మా న్యూస్ ( ఉపసంహరించుకుంది), ఎబిసి న్యూస్ ఉన్నాయి.  ఇవి కాకుండా 12 దరఖాస్తులను ప్రభుత్వం తోసిపుచ్చింది.

వీటిలో 394  న్యూస్ చానల్స్ కాగా మిగిలిన 475 నాన్-న్యూస్ చానల్స్. భారతదేశం నుంచి అప్ లింకింగ్ కి మాత్రమే అనుమతిపొంది విదేశాలలో మాత్రమే డౌన్ లింక్ అయ్యే చానల్స్ సంఖ్య 12 కాగా వాటిలో 7 న్యూస్ చానల్స్,  5 నాన్-న్యూస్ చానల్స్ ఉన్నాయి. అప్ లింకింగ్ తో బాటు డౌన్ లింకింగ్ కి కూడా అనుమతి పొందిన చానల్స్ సంఖ్య 754 కాగా వాటిలో 382 నాన్ – న్యూస్ చానల్స్, 372 చానల్స్ ఉన్నాయి.

గత జనవరి 31 తరువాత జీ బీహార్, డబ్ల్యు ఐఓ, జీ 24 బిజినెస్, సబ్ బంగ్లా, సబ్ తమిళ్, సబ్ తెలుగు, సబ్ మరాఠీ, సోనీ వాహ్, సోనీ రాక్స్, జ్యువెల్ అలయెన్స్, స్టార్ ఉత్సవ్ మూవీస్ (గతంలో స్టార్ గోల్డ్ రొమాన్స్ ), మా హెచ్ డి,  జల్సా మూవీస్ హెచ్ డి, స్టార్ జల్సా హెచ్ డి, మా మూవీస్ హెచ్ డి, స్టార్ ప్రవాహ్ హెచ్ డి, స్టార్ మూవీస్ ప్రీమియర్, స్టార్ మూవీస్ ప్రీమియర్ హెచ్ డి, ఫాక్స్ క్రైమ్ హెచ్ డి, రిష్టే సినీప్లెక్స్, స్టే రా, విజయ్ సూపర్ లైసెన్స్ పొందాయి.

 

 

.