• Home »
  • Circulars »
  • సమాచార శాఖ కార్యదర్శి బిమల్ జుల్కా రిటైర్మెంట్, కొత్త కార్యదర్శి సునిల్ అరోరా

సమాచార శాఖ కార్యదర్శి బిమల్ జుల్కా రిటైర్మెంట్, కొత్త కార్యదర్శి సునిల్ అరోరా

సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ కార్యదర్శి బిమల్ జుల్కా ఈ నెలాఖరుకు రిటైర్ అవుతున్నారు. 1979 బాచ్ మధ్యప్రదేశ్ కేడర్ కు చెందిన జుల్కా 2013 జులై1 న సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ కార్యదర్శిగా చేరారు. ఆయన స్థానంలో సీనియర్ అధికారి సునిల్ అరోరా నియమితులయ్యారు. ఆయన 1980 బాచ్ రాజస్థాన్ కేడర్ అధికారి. ప్రస్తుతం మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెఅవలప్ మెంట్ లో పనిచేస్తున్నారు. గతంలో ఎయిరిండియా సిఎండి గా కూడా పనిచేశారు.

జుల్కా హయాంలో టీవీ రేటింగ్స్ మీద కమిషన్ ఏర్పాటైంది. దాని ఫలితంగానే ఇప్పుడు టామ్ మూతబడింది. అదే విధంగా డిజిటైజేషన్ గడువు పొడిగించటం, డిడి కిసాన్ చానల్ ప్రారంభించటం, ప్రకటనలమీద పరిమితి అమలు, ఎఫ్ ఎం రేడియో మూడో దశ వేలం లాంటి కీలకమైన చర్యలు ఆయన హయాంలోనే జరిగాయి. అయితే, డిటిహెచ్ ఆపరేటర్ల పట్ల కఠినంగా వ్యవహరించి 2000 కోట్ల రూపాయలు లైసెన్స్ ఫీజు రూపంలో చెల్లించాలని పట్టుబట్టినప్పుడు మాత్రం వ్యవహారం కోర్టుకెక్కింది. ఒత్తిడి చేయవద్దని కోర్టు ప్రభుత్వానికి చెప్పింది.