• Home »
  • MIB/Licencing »
  • బ్రాడ్ కాస్ట్ కంపెనీల ప్రతినిధులతో సమాచార మంత్రిత్వశాఖ సమావేశం

బ్రాడ్ కాస్ట్ కంపెనీల ప్రతినిధులతో సమాచార మంత్రిత్వశాఖ సమావేశం

శాటిలైట్ చానల్ లైసెన్స్ దరఖాస్తుల స్థితిగతులు సహా సమాచార, ప్రసార మంత్రిత్వశాఖలో పెండింగ్ లో ఉన్న ఫైల్స్ పరిస్థితి తెలుసుకోవటానికి వీలుగా ఈ నెల 21 న బ్రాడ్ కాస్ట్ సంస్థల ప్రతినిధులతో సమావేశం జరపాలని మంత్రిత్వశాఖ నిర్ణయించింది. నెలనెలా ఈ తరహా సమావేశాలు జరపటం ఆనవాయితీ అయినప్పటికీ ఒక్కోసారి మొదటి వారంలో జరపటం కుదరనప్పుడు వాయిదా పడుతూ ఉంటాయి.

 

ఢిల్లీ శాస్త్రి భవన్ ఎ వింగ్ లోని రూమ్ నెంబర్ 664 లో జరిగే ఈ సమావేశానికి హాజరు కాదలచుకున్న బ్రాడ్ కాస్ట్ సంస్థల ప్రతినిధులు ఈ నెల 18 లోగా తమ వివరాలు, సమాచారం కోరుతున్న అంశాలు తెలియజేస్తూ ఈ మెయిల్ ద్వారా dirbc-moib@nic.in కి గాని ఫాక్స్ ద్వారా అయితే 011-23386536కు గాని పంపాలి. 21 న ఉదయం 11 గంటలనుంచి సమావేశం జరుగుతుంది.