• Home »
  • National Channels »
  • డిడి కిసాన్ కోసం అమితాబ్ తో ప్రచార ఒప్పందాలు నిజం కాదు : కేంద్రం

డిడి కిసాన్ కోసం అమితాబ్ తో ప్రచార ఒప్పందాలు నిజం కాదు : కేంద్రం

దూరదర్శన్ కిసాన్ చానల్ కోసం ప్రచారానికి అమితాబ్ బచ్చన్ కు ఆరుకోట్లకు పైగా చెల్లించినట్టు వచిన వార్తలమీద కేంద్రప్రభుత్వం పార్లమెంటులో వివరణ ఇచ్చింది. కిసాన్ చానల్ ప్రచారకర్త అమితాబ్ తో దూరదర్శన్ ఒప్పందం చేసుకున్నమాట నిజం కాదని, ఆయనకు ఎలాంటి చెల్లింపులూ జరపలేదని సమాచార, ప్రసార శాఖ సహాయమంత్రి రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ రాజ్యసభ ప్రశ్నోత్తరాల సమయంలో చెప్పారు.

లింటాస్ అనే యాడ్ ఏజెన్సీ ద్వారా అమితాబ్ బచ్చన్ రూ. 6.31 కోట్లు తీసుకొని కిసాన్ చానల్ కు ప్రచారకర్తగా వ్యవహరించినట్టు మీడియాలో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే, తన తరఫున యాడ్ ఏజెన్సీ బేరమాడి ఉండవచ్చునని, సామాజిక కార్యక్రమాలకు పారితోషికం తీసుకోనని తాను చెప్పి ఉచితంగానే ప్రచారంలో పాల్గొన్నానని ఆ తరువాత అమితాబ్ వివరణ ఇచ్చారు. డిడి నుంచి యాడ్ ఏజెన్సీ తీసుకున్న మొత్తాన్ని తిరిగి చెల్లించటంతో ఆ వ్యవహారానికి అంతటితో తెరపడింది.