• Home »
  • Cable »
  • ఎమ్మెస్వో, ఆపరేటర్ మధ్య ఒప్పందాలకు ట్రాయ్ నమూనాలు

ఎమ్మెస్వో, ఆపరేటర్ మధ్య ఒప్పందాలకు ట్రాయ్ నమూనాలు

ఎమ్మెస్వోలకు, ఆపరేటర్లకు మధ్య వివాదాలు రాకుండా చూసేందుకు టెలికామ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) తన ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఎవరి హక్కులు ఏంటి? ఎవరి బాధ్యతలు ఏంటి ? ఎలాంటి సందర్భాలలో బాధ్యతలలో ఏ మేరకు మార్పు ఉండే అవకాశముంది? చందాదారు విషయంలో ఇద్దరూ అనుసరించాలసిన విధి విధానాలేంటి అని స్పష్టం చేస్తూ ఒప్పందాల స్వరూపాన్ని వివరించింది. ఇందుకోసం ఒక ప్రామాణిక ఒప్పందం గురించి, ఒక నమూనా ఒప్పందం గురించి సవివరంగా తెలియజేసింది.

ట్రాయ్ విడుదలచేసిన ప్రామాణిక ఒప్పందం ప్రకారం ఎమ్మెస్వో, ఆపరేటర్ నిర్దిష్టమైన హక్కులు, బాధ్యతలు కలిగి ఉంటారు. ఎవరి పరిధి వారికి అందులో స్పష్టంగా నిర్వచించబడి ఉంటుంది. డిజిటైజేషన్ లో ఎవరికీ ఇబ్బందులు రాకుండా, ముందు ముందు వివాదాలు తలెత్తకుండా ట్రాయ్ ఈ ఏర్పాటు చేసింది. అయితే, పూర్తిగా ఇలాగే ఒప్పందం ఉండి తీరాలన్న నిబంధనకు కొన్ని సడలింపులు కూడా ఇచ్చింది. ఆ సడలింపులు హద్దులు మీరకుండా ఉండాలని, ప్రామాణిక ఒప్పందం స్వరూపాన్నే మార్చేసే విధంగా ఉండకూడదని కూడా స్పష్టం చేసింది. ఈ విషయాన్ని అర్థం చేసుకోవటానికి ఒక నమూనా ఒప్పందంలో ఉండే అంశాలమీద కూడా వివరణ ఇచ్చింది.

ఎమ్మెస్వో గాని ఆపరేటర్ గాని ఎవరికి వాళ్ళే తమ హక్కులు నిర్దేశించుకొని గొడవపడకుండా ఉండటానికి ఈ ఒప్పందం కచ్చితంగా ఉపయోగపడుతుంది. అయితే, ఒక్కోచోట స్థానిక పరిస్థితులకు అనుగుణంగా, ఇద్దరి మధ్య ఉన్న వ్యాపార సంబంధాలు, పెట్టుబడులలో వాటా, మౌలిక సదుపాయాలు ఎవరు కల్పించారనే అంశాల ఆధారంగా కొద్దిపాటు మార్పులు చేసుకోవటానికి అవకాశం కల్పించటమే ట్రాయ్ ప్రధానోద్దేశం. ఆదాయ పంపిణీ విషయంలో ఇరు పక్షాలకూ ఆమోదయోగ్యమైన మార్గం దొరికితే నమూనా ఒప్పందం ప్రకారం సంతకాలు చేసుకోవచ్చు. అలాంటి ఏకాభిప్రాయం కుదరనప్పుడు అనివార్యంగా 2015 డిసెంబర్ లో ట్రాయ్ ప్రకటించిన ప్రామాణిక ఒప్పందానికి కట్టుబడి తీరాల్సిందే.

ఉచిత చానల్స్ విషయంలో 55:45 నిష్పత్తిలోను, పే చానల్స్ విషయంలో 65:35 నిష్పత్తిలోను పంచుకోవాలని గతంలో ట్రాయ్ చెప్పింది. అయితే, సవరించిన ఇంటర్ కనెక్ట్ ఒప్పందాల ప్రకారం పాకేజ్ రూపకల్పన, ధర నిర్ణయం ఎమ్మెస్వోకే అప్పగించింది. బ్రాడ్ కాస్టర్ల నుంచి పే చానల్స్ ఒప్పందం చేసుకునేది, హెడ్ ఎండ్ నిర్వహించేది, ఎన్ కోడింగ్, ఎన్ క్రిప్షన్, మల్టీప్లెక్సింగ్, ఎస్ ఎమ్ ఎస్ నిర్వహించేది ఎమ్మెస్వో నే కాబట్టి  ట్రాయ్ ఇలాంటి నిర్ణయం తీసుకుంది. పైగా, ఒక్కో ఆపరేటర్ కోరుకున్న విధంగా పాకేజీలు తయారుచేయటం ఆచరణలో సాధ్యం కాని విషయమని కూడా ట్రాయ్ గుర్తించింది.

అయితే, పాకేజీలలో ఎమ్మెస్వో ఏదైనా మార్పు చేయదలచుకుంటే ఆ విషయాన్ని కనీసం 15 రోజులు ముందుగా ఆపరేటర్ కు తెలియజేయాలనే నిబంధనను ట్రాయ్ ఈ ఒప్పందాలలో చేర్చింది. ఇప్పుడు తాజాగా ప్రకటించిన నమూనా, ప్రామాణిక ఒప్పందాలకు అనుగుణంగా ఇంతకుముందు చేసుకున్న ఒప్పందాలను 30 రోజుల్లోగా సవరించుకోవటానికి కూడా ట్రాయ్ అవకాశం కల్పించింది. సిగ్నల్స్ ఇవ్వాల్సిందిగా ఆపరేటర్ నుంచి అభ్యర్థన అందిన 30 రోజుల్లోగా ఎమ్మెస్వో ఒప్పందానికి సిద్ధం కావాలి. దరఖాస్తు తేదీనుంచి 60 రోజుల్లోగా సిగ్నల్స్ ఇచ్చి తీరాలి. ఒకవేళ ఇవ్వటం కుదరకపోతే కారణాలు పేర్కొంటూ ఆపరేటర్ కు సమాధానం ఇవ్వాలి.

ఎస్ ఎమ్ ఎస్ నిర్వహణ ఎలాగూ ఎమ్మెస్వో కే ఉంటుంది కాబట్టి బిల్లు తయారీ బాధ్యత ఎమ్మెస్వో కే ఉంటుందని ట్రాయ్ స్పష్టం చేసింది. మరమ్మతులకు, నిర్వహణకు వీలు కల్పించేలా ఆపరేటర్  పరిధిలోని మొత్తం సెట్ టాప్ బాక్సులలో కనీసం 2 శాతం బాక్సులు ఆపరేటర్ దగ్గర ఉంచాలి. అయితే వీటి గరిష్ఠ సంఖ్య 30గా నిర్ణయించారు. అప్పుడే ఏ బాక్స్ అయినా పనిచేయకపోతే వెంటనే మార్చి , అ పనిచేయని బాక్స్ ను మరమ్మతు చేయటం సాధ్యమవుతుందన్నది ట్రాయ్ అభిప్రాయం. ఒక ఆపరేటర్ ఒకరు కంటే ఎక్కువమంది ఎమ్మెస్వోలనుంచి ఫీడ్ తీసుకునే వెసులుబాటు కూడా ఉంది. అయితే, ఒక ఎమ్మెస్వో తో ఒప్పందం కుదిరిన తరువాత మరో ఎమ్మెస్వో నుంచి డిస్ కనెక్ట్ కావాలని కొందరు ఆపరేటర్లు కోరుకోవచ్చు. అయితే, అలాంటి సందర్భాలలో ఆ ఎమ్మెస్వో కు ముందస్తు నోటీసు ఇవ్వాల్సి ఉంటుంది. చందాదారుడు దరఖాస్తు చేసుకుంటే తప్ప ఒక ఎమ్మెస్వో ఇచ్చిన సెట్ టాప్ బాక్స్ తీసేసి మరో ఎమ్మెస్వోకి మార్చటం సాధ్యం కాదు.

ఇరు పక్షాల బాధ్యతలకు అనుగుణంగా ఆదాయంలో పంపిణీ జరగాల్సి ఉంటుంది కాబట్టి వాళ్ళకు ఆమోదయోగ్యంగా ఉండేట్టు నిర్ణయించుకోవాలని ట్రాయ్ సూచించింది. ప్రామాణిక ఒప్పందం విషయంలో చందాదారులకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని పరస్పరం పంచుకోవాలి. చెల్లింపులలో విఫలమైతే, స్టేట్ బాంక్ ఆఫ్ ఇండియా వడ్డీ రేటుకు అదనంగా మరో రెండు శాతం కలిపి పెనాల్టీ రూపంలో చెల్లించాలి. వరుసగా మూడు నెలలపాటు చెల్లింపులో విఫలమైతే ఎలాంటి విధానం అనుసరించాలో ఇప్పటికే ట్రాయ్ చెప్పింది. మొత్తంగా చూస్తే వివాదాలు రాకుండా చూసుకోవటం, చందాదారులకు మెరుగైన సేవలందించటం అనేవే అత్యంత కీలకమని ట్రాయ్ భావిస్తోంది.  సేవల నాణ్యత  అద్భుతంగా ఉండేందుకు అటు ఎమ్మెస్వో, ఇటు కేబుల్ ఆపరేటర్ కృషి చేయాలని ట్రాయ్ చెబుతోంది.

 

నమూనా ఒప్పందం

ఎమ్మెస్వోలు, ఆపరేటర్ల పాత్ర, బాధ్యతలు

సంఖ్య పాత్ర పరస్పరం ఒప్పుకున్న బాధ్యతలు – తగినట్టు నింపాలి వివరణ
1. చందాదారు సెట్ టాప్ బాక్స్ తీసుకోవటానికి అందుబాటులో ఉన్న స్కీములు, వారంటీలు, మరమ్మతులు గురించి ప్రచారం చేయటం
2. కేబుల్ టీవీ సర్వీస్ కనెక్షన్ కోసం, డిస్ కనెక్షన్ కోసం, రీ కనెక్షన్ కోసం, బదలాయింపు, తరలింపు కోసం నిబంధనల ప్రకారం దరఖాస్తుల తయారీ
3. ఆచరణ సూత్రాల మాన్యువల్ ప్రచురణ
4. వినియోగదారుల నియమావళి ప్రచురణ
5. సేవలు, ఫిర్యాదుల కేంద్రం, ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ, ఫిర్యాదుల పరిశీలన, పౌర సేవల నియమావళి, నోడల్ అధికారి తదితర వివరాలతో వెబ్ సైట్ ఏర్పాటు
6. ఎ. ఫిర్యాదుల కేంద్రం ఏర్పాటుi. చందాదారుల సేవా సంబంధ అంశాలకు

ii. చందాదారుల ఫిర్యాదుల పరిష్కారం

బి. వెబ్ ఆధారిత ఫిర్యాదుల పరిశీలనా వ్యవస్థ  ఏర్పాటు చేయటం

సి. వినియోగదారులకోసం ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేసి ప్రచారం చేయటం

డి. ఫిర్యాదుల పరిష్కార నిబంధనావళికి అనుగుణంగా వినియోగదారుల ఫిర్యాదులన్నీ నమోదు చేసే రికార్డుల నిర్వహణ

 

ఈ బాధ్యతను ఎమ్మెస్వోకి ఇచ్చినట్టయితే అప్పుడు ఎమ్మెస్వో ఆ ఫిర్యాదు కేంద్రం వివరాలను చందాదారుడికి అందేలా ఎప్పటికప్పుడు ఆపరేటర్ కు పంపాలి

7. సేవలలో అంతరాయం ఏర్పడితే చందా మొత్తంలో ఏ మేరకు డిస్కౌంట్ ఇచ్చేదీ చెప్పటం, ఆ విషయం ప్రచారం చేయటం
8. ఎ. సెట్ టాప్ బాక్స్ తీసుకొవటానిక్, తిరిగి ఇవ్వటానికి అందుబాటులో ఉన్న స్కీముల గురించి, వాటి మరమ్మతు/వారంటీ గురించి చందాదారుకు తెలియజేయటంబి. ఆచరణ నియమావళితోబాటు దరఖాస్తు అందజేయటం

సి. చందాదారులు/దరఖాస్తుదారుల నుంచి

i.కనెక్షన్, రీకనెక్షన్, బదలీ, తరలింపు దరఖాస్తులు అందుకోవటం

ii.సెట్ టాప్ బాక్స్ తీసుకున్నా, తిరిగి ఇచ్చినా ఆ దరఖాస్తు తీసుకోవటం

డి. దరఖాస్తుదారుడి దరఖాస్తు డూప్లికేట్ కాపీని తిరిగి ఇస్తూ అందినట్టు అందులో పేర్కొనటం

ఇ. దరఖాస్తులో ఏవైనా లోపాలుంటే అందుకున్న 2 రోజుల్లోగా  తెలియజేయటం

ఎఫ్. కనెక్షన్ ఇవ్వటం, రీకనెక్షన్, సర్వీస్ బదలాయింపు, ఆ ప్రదేశంలో సెట్ టాప్ బాక్స్ సరఫరా సాంకేతికంగా సాధ్యం కానప్పుడు దరఖాస్తుదారు అడిగిన 2 రోజుల్లో తెలియజేయటం.

 

ఈ బాధ్యత అప్పగించబడిన వారు ( ఎమ్మెస్వో/ఆపరేటర్) ఆ సమాచారాన్ని దరఖాస్తు అందిన 24 గంటల్లోగా ఎస్ ఎమ్ ఎస్  (Subscriber Management System) ద్వారా తెలియజేయాలి

9. దరఖాస్తుదారుకు ప్రత్యేకమైన గుర్తింపు సంఖ్య ఈ సంఖ్య ఎస్ ఎమ్ ఎస్ నుంచి వస్తుంది. ఈ బాధ్యత ఆపరేటర్ దే అయితే అప్పుడు ఆ ఎస్ ఎమ్ ఎస్ బాధ్యతను ఎమ్మెస్వో ఆ ఆపరేటర్ కే ఇవ్వాలి.
10. చందాదారు ఆవరణలో సెట్ టాప్ బాక్స్ పెట్టటం, ఎస్ ఎమ్ ఎస్ ద్వారా యాక్టివేట్ చేయటం ఈ బాధ్యత ఆపరేటర్ కి ఇస్తే  ఎస్ ఎమ్ ఎస్ నిర్వహణ బాధ్యత కూడా ఆపరేటర్ కివ్వాలి
11. సెట్ టాప్ అమర్చటంలో, యాక్టివేట్ చేయటం లో జరిగిన జాప్యానికి డిస్కౌంట్ ఇవ్వటం
12. కేబుల్ సర్వీస్ డిస్ కనెక్ట్ చేయాల్సి వస్తే అందుకు కారణాలు పేర్కొంటూ 15 రోజుల ముందస్తు నోటీసివ్వటం
13. డిస్ కనెక్షన్ కు లేదా సర్వీస్ నిలుపుదలకు చందాదారు నుంచి వచ్చే విజ్ఞప్తి అందుకొని దాన్ని అమలుచేయటం
14. చందా పాకేజ్ మార్చవలసిందిగా కోరుతూ వచ్చే విజ్ఞప్తి అందుకొని అమలు చేయటం
15. నిర్వహణ పనులకోసం సేవల్లో అంతరాయం కలగబోతుంటే చందాదారుకు ఆ మేరకు నోటీసివ్వటం
16. సేవల నాణ్యతా నిబంధనల ప్రకారం చందాదారు ఫిర్యాదులకు స్పందించటం ఫిర్యాదు అందుకున్న వెంటనే వెబ్ ఆధారిత ఫిర్యాదు వ్యవస్థలోకి ఎక్కించటం ద్వారా ఎమ్మెస్వో/ ఆపరేటర్ సకాలంలో తగిన చర్యలు తీసుకోవటం వీలవుతుంది.
17. సేవల నాణ్యతా నిబంధనల ప్రకారం చందాదారు ఫిర్యాదులకు స్పందించటంi.ప్రసారాలు లేకపోవటం మీద

ii.సెట్ టాప్ బాక్స్ గురించి

iii.చందాదారు బిల్లులు, రశీదులమీద

iv.మరేదైనా ఫిర్యాదు మీద

పరిష్కరించిన ఫిర్యాదుల వివరాలను ఎమ్మెస్వో/ఆపరేటర్ వెంటనే వెబ్ ఆధారిత పర్యవేక్షక వ్యవస్థలో అప్ డేట్ చేయాలి
18. చందాదారు ఫిర్యాదుల పరిష్కార నిబంధనల ప్రకారం నోడల్ అధికారి హోదా
19. అధికారి నుంచి అందిన ఫిర్యాదు పరిష్కారం మీద చందాదారుకు సమాచారమివ్వటం
20. కంప్యూటర్ ద్వారా తయారైన అంశాలవారీ బిల్లులు ముద్రించి అందజేయటం
21. చందా చెల్లింపు రశీదులు అందజేయటం
22. ముట్టినట్టు చందాదారుకు ఎలక్ట్రానిక్ పద్ధతిలో తెలియజెప్పటం
23. ఆరు నెలలవరకు ప్రీపెయిడ్ బిల్స్ విషయంలో అంశాలవారీగా వాడకం, దాని బిల్లులు అడిగితే ఇవ్వటం ఆపరేటర్ కు అందిన విజ్ఞప్తిని ఎస్ ఎమ్ ఎస్ ద్వారా వెంటనే అప్ డేట్ చేయటం ద్వారా స్వయంగా ఎమ్మెస్వో అవసరమైన వివరాలు చందాదారుకు ఇవ్వగలుగుతాడు
24. ప్రభుత్వానికి పన్నుల చెల్లింపు ఎమ్మెస్వో మరియు / లేదా ఆపరేటర్ సంబంధిత పన్ను అధికారుల నియమనిబంధనల ప్రకారం పన్ను చెల్లింపు బాధ్యతల గురించి ఒప్పందం మీద సంతకాలు చేసుకునేటప్పుడు స్పష్టంగా రాసుకోవాలి

 

              ప్రామాణిక ఒప్పందం

ఎమ్మెస్వోలు, ఆపరేటర్ల పాత్ర, బాధ్యతలు

సంఖ్య పాత్ర టారిఫ్ ఉత్తర్వులలో 5వ క్లాజ్ కింద ఒప్పందం చేసుకుంటే బాధ్యతలు వివరణ
1. చందాదారు సెట్ టాప్ బాక్స్ తీసుకోవటానికి అందుబాటులో ఉన్న స్కీములు, వారంటీలు, మరమ్మతులు గురించి ప్రచారం చేయటం  

 

ఎమ్మెస్వో

*సెట్ టాప్ బాక్స్ ఇవ్వటం, వెనక్కి తీసుకోవటం, వారెంటీ, మరమ్మతు విధానాన్ని ఎమ్మెస్వో రూపొందిస్తాడు. వివరాలు ఆపరేటర్ కి చెబుతాడు*రకరకాల పాకేజీలు ఎమ్మెస్వో రూపొందించి ఆపరేటర్ కి చెబుతాడు

*ఆచరణ సూత్రాల మాన్యువల్, చందాదారు నియమావళిని ఎమ్మెస్వో ఖరారు చేసి వాటి ప్రతులను ఆపరేటర్ కు అందిస్తాడు

2. కేబుల్ టీవీ సర్వీస్ కనెక్షన్ కోసం, డిస్ కనెక్షన్ కోసం, రీ కనెక్షన్ కోసం, బదలాయింపు, తరలింపు కోసం నిబంధనల ప్రకారం దరఖాస్తుల తయారీ
3. ఆచరణ సూత్రాల మాన్యువల్ ప్రచురణ
4. వినియోగదారుల నియమావళి ప్రచురణ
5. సేవలు, ఫిర్యాదుల కేంద్రం, ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ, ఫిర్యాదుల పరిశీలన, పౌర సేవల నియమావళి, నోడల్ అధికారి తదితర వివరాలతో వెబ్ సైట్ ఏర్పాటు ఎమ్మెస్వో
6. ఇ. ఫిర్యాదుల కేంద్రం ఏర్పాటుi. చందాదారుల సేవా సంబంధ అంశాలకు

ii. చందాదారుల ఫిర్యాదుల పరిష్కారం

ఎఫ్. వెబ్ ఆధారిత ఫిర్యాదుల పరిశీలనా వ్యవస్థ  ఏర్పాటు చేయటం

జి. వినియోగదారులకోసం ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేసి ప్రచారం చేయటం

హెచ్. ఫిర్యాదుల పరిష్కార నిబంధనావళికి అనుగుణంగా వినియోగదారుల ఫిర్యాదులన్నీ నమోదు చేసే రికార్డుల నిర్వహణ

 

ఎమ్మెస్వో

 

ఎమ్మెస్వో ఆ ఫిర్యాదు కేంద్రం వివరాలను చందాదారుడికి అందేలా ఎప్పటికప్పుడు ఆపరేటర్ కు పంపాలి

7. సేవలలో అంతరాయం ఏర్పడితే చందా మొత్తంలో ఏ మేరకు డిస్కౌంట్ ఇచ్చేదీ చెప్పటం, ఆ విషయం ప్రచారం చేయటం ఎమ్మెస్వో అలాంటి స్కీమ్ వివరాలను చందాదారుకు అందేలా ఆపరేటర్ కు ఎమ్మెస్వో పంపాలి
8. జి. సెట్ టాప్ బాక్స్ తీసుకొవటానిక్, తిరిగి ఇవ్వటానికి అందుబాటులో ఉన్న స్కీముల గురించి, వాటి మరమ్మతు/వారంటీ గురించి చందాదారుకు తెలియజేయటంహెచ్. ఆచరణ నియమావళితోబాటు దరఖాస్తు అందజేయటం

ఐ. చందాదారులు/దరఖాస్తుదారుల నుంచి

iii.కనెక్షన్, రీకనెక్షన్, బదలీ, తరలింపు దరఖాస్తులు అందుకోవటం

iv.సెట్ టాప్ బాక్స్ తీసుకున్నా, తిరిగి ఇచ్చినా ఆ దరఖాస్తు తీసుకోవటం

జె. దరఖాస్తుదారుడి దరఖాస్తు డూప్లికేట్ కాపీని తిరిగి ఇస్తూ అందినట్టు అందులో పేర్కొనటం

కె. దరఖాస్తులో ఏవైనా లోపాలుంటే అందుకున్న 2 రోజుల్లోగా  తెలియజేయటం

ఎల్. కనెక్షన్ ఇవ్వటం, రీకనెక్షన్, సర్వీస్ బదలాయింపు, ఆ ప్రదేశంలో సెట్ టాప్ బాక్స్ సరఫరా సాంకేతికంగా సాధ్యం కానప్పుడు దరఖాస్తుదారు అడిగిన 2 రోజుల్లో తెలియజేయటం.

 

కేబుల్ ఆపరేటర్

 

కేబుల్ ఆపరేటర్ తనకు దరఖాస్తు అందిన 24 గంటల్లోగా ఎస్ ఎమ్ ఎస్  (Subscriber Management System) లో సమాచారాన్ని అప్ డేట్ చేయాలి

9. దరఖాస్తుదారుకు ప్రత్యేకమైన గుర్తింపు సంఖ్య కేబుల్ ఆపరేటర్ ఈ సంఖ్య ఎస్ ఎమ్ ఎస్ నుంచి వస్తుంది. సంబంధిత సమాచార  నిర్వహణ బాధ్యత నెరవేర్చే అవకాశం ఎమ్మెస్వో ఆ ఆపరేటర్ కే ఇవ్వాలి.
10. చందాదారు ఆవరణలో సెట్ టాప్ బాక్స్ పెట్టటం, ఎస్ ఎమ్ ఎస్ ద్వారా యాక్టివేట్ చేయటం కేబుల్ ఆపరేటర్ సంబంధిత ఎస్ ఎమ్ ఎస్  నిర్వహణ బాధ్యత నెరవేర్చే అవకాశం ఎమ్మెస్వో ఆ ఆపరేటర్ కే ఇవ్వాలి.
11. సెట్ టాప్ అమర్చటంలో, యాక్టివేట్ చేయటం లో జరిగిన జాప్యానికి డిస్కౌంట్ ఇవ్వటం ఎమ్మెస్వో జాప్యానికి కారణం ఆపరేటర్ అయితే ఆ డిస్కౌంట్ మొత్తాన్ని ఆపరేటర్ నుంచి వసూలు చేసుకోవచ్చు
12. కేబుల్ సర్వీస్ డిస్ కనెక్ట్ చేయాల్సి వస్తే అందుకు కారణాలు పేర్కొంటూ 15 రోజుల ముందస్తు నోటీసివ్వటం ఎమ్మెస్వో చందాదారుకు ముందస్తు నోటీసు ఇచ్చేముందు ఎమ్మెస్వో ఆ ఆపరేటర్ కు రాతపూర్వకంగా తెలియజేయాలి
13. డిస్ కనెక్షన్ కు లేదా సర్వీస్ నిలుపుదలకు చందాదారు నుంచి వచ్చే విజ్ఞప్తి అందుకొని దాన్ని అమలుచేయటం కేబుల్ ఆపరేటర్ ఆపరేటర్ ఈ విషయాన్ని వెంటనే ఎస్ ఎమ్ ఎస్ లో అప్ డేట్ చేయాలి
14. చందా పాకేజ్ మార్చవలసిందిగా కోరుతూ వచ్చే విజ్ఞప్తి అందుకొని అమలు చేయటం కేబుల్ ఆపరేటర్ ఆపరేటర్ ఈ విషయాన్ని వెంటనే ఎస్ ఎమ్ ఎస్ లో అప్ డేట్ చేయాలి
15. నిర్వహణ పనులకోసం సేవల్లో అంతరాయం కలగబోతుంటే చందాదారుకు ఆ మేరకు నోటీసివ్వటం ఎమ్మెస్వో ఆపరేటర్ మరమ్మతులు చేపడుతుంటే చందాదారుకు సమాచారమిచ్చేలా ఎమ్మెస్వోకు తెలియజేయాలి
16. సేవల నాణ్యతా నిబంధనల ప్రకారం చందాదారు ఫిర్యాదులకు స్పందించటం ఎమ్మెస్వో ఫిర్యాదు అందుకున్న వెంటనే వెబ్ ఆధారిత ఫిర్యాదు వ్యవస్థలోకి ఎక్కిస్తే ఎమ్మెస్వో/ఆపరేటర్ స్పందించటం చందాదారు తెలుసుకోగలుగుతాడు
17. సేవల నాణ్యతా నిబంధనల ప్రకారం చందాదారు ఫిర్యాదులకు స్పందించటంi.ప్రసారాలు లేకపోవటం మీద

ii.సెట్ టాప్ బాక్స్ గురించి

iii.చందాదారు బిల్లులు, రశీదులమీద

iv.మరేదైనా ఫిర్యాదు మీద

మొత్తంగా బాధ్యత ఎమ్మెస్వోది.

ఆపరేటర్ నెట్ వర్క్ లో లోపాలను ఆపరేటరే సరిదిద్దుకుంటాడు

పరిష్కరించిన ఫిర్యాదుల వివరాలను ఎమ్మెస్వో/ఆపరేటర్ వెంటనే వెబ్ ఆధారిత పర్యవేక్షక వ్యవస్థలో అప్ డేట్ చేయాలి
18. చందాదారు ఫిర్యాదుల పరిష్కార నిబంధనల ప్రకారం నోడల్ అధికారి హోదా ఎమ్మెస్వో
19. అధికారి నుంచి అందిన ఫిర్యాదు పరిష్కారం మీద చందాదారుకు సమాచారమివ్వటం ఎమ్మెస్వో
20. కంప్యూటర్ ద్వారా తయారైన అంశాలవారీ బిల్లులు ముద్రించి అందజేయటం  

ఎమ్మెస్వో

చందాదారు నుంచి ఆపరేటర్ చందా వసూలు చేస్తే ఆ వసూలు వివరాలు వెంటనే ఎస్ ఎమ్ ఎస్ లో అప్ డేట్ చేయటం వలన చందాదారుకు ఎలక్ట్రానిక్ పద్ధతిలో తక్షణం రసీదు అందుతుంది
21. చందా చెల్లింపు రశీదులు అందజేయటం
22. ముట్టినట్టు చందాదారుకు ఎలక్ట్రానిక్ పద్ధతిలో తెలియజెప్పటం
23. ఆరు నెలలవరకు ప్రీపెయిడ్ బిల్స్ విషయంలో అంశాలవారీగా వాడకం, దాని బిల్లులు అడిగితే ఇవ్వటం ఎమ్మెస్వో ఆపరేటర్ కు అందిన విజ్ఞప్తిని ఎస్ ఎమ్ ఎస్ ద్వారా వెంటనే అప్ డేట్ చేయటం ద్వారా స్వయంగా ఎమ్మెస్వో అవసరమైన వివరాలు చందాదారుకు ఇవ్వగలుగుతాడు
24. ప్రభుత్వానికి పన్నుల చెల్లింపు ఎమ్మెస్వోమరియు/లేదా ఆపరేటర్ సంబంధిత పన్ను అధికారుల నియమనిబంధనల ప్రకారం పన్ను చెల్లింపు బాధ్యతల గురించి ఒప్పందం మీద సంతకాలు చేసుకునేటప్పుడు స్పష్టంగా రాసుకోవాలి