• Home »
  • Audience »
  • ప్రైమ్ చానల్స్ రేటింగ్స్ మీద సినిమాల ప్రభావం

ప్రైమ్ చానల్స్ రేటింగ్స్ మీద సినిమాల ప్రభావం

తెలుగు జనరల్ ఎంటర్టైన్మెంట్ చానల్స్ రేటింగ్స్ మీద సినిమాల ప్రభావం స్పష్టంగా కనబడింది. సంక్రాంతి సందర్భంగా ప్రసారం చేసిన ప్రత్యేక కార్యక్రమాలకంటే సినిమాల ప్రభావం వల్లనే రేటింగ్స్ పుంజుకున్నట్టు, రాంకులు తారుమారైనట్టు అర్థమవుతోంది. కేవలం అరగంటకే పరిమితమయ్యే సీరియల్స్ ఎలాగూ మామూలుగా సంపాదించే రేటింగ్స్ వలన కొత్తదనం ఏదీ ఉండదు.  ప్రకటనలతో కలిసి మూడు గంటలకు పైగా సాగే సినిమాలవల్లనే తేడా కనబడుతుంది గనుక చానల్స్ కూడా ప్రత్యేక సందర్భాలకోసం సీరియల్స్  కంటే సినిమాలకే ప్రాధాన్యం ఇస్తున్నాయి.

స్టార్ మా టీవీ ప్రసారం చేసిన రాజా ది గ్రేట్ సినిమా కోటీ 31 లక్షల 37 వేల వీక్షణలు నమోదు చేసుకోగా జెమినీ టీవీలోప్రసారమైన జై లవకుశ కు కోటీ 28 లక్షల 40 వేల వీక్షణలు లభించాయి. వీటివల్లనే 3 వ వారంలో తెలుగు జనరల్ ఎంటర్టైన్మెంట్ చానల్స్ రాంకులు తారుమారయ్యాయి. సీరియల్స్ లో ఈటీవీ కి రెండు, జీ తెలుగుకు ఒక స్థానం దక్కటంతో టాప్ 5 కార్యక్రమాల్లో అన్ని చానల్స్ కూ చోటు దక్కినట్టయింది.

రాంకు చానల్ కార్యక్రమం వీక్షణలు (వేలల్లో)
1 స్టార్ మా రాజా ది గ్రేట్ ( సినిమా) 13137
2 జెమిని టీవీ జై లవకుశ ( సినిమా) 12840
3 ఈటీవీ తెలుగు స్వాతి చినుకులు ( సీరియల్) 8348
4 ఈటీవీ తెలుగు మనసు మమత ( సీరియల్) 7172
5 జీ తెలుగు ముద్దమందారం ( సీరియల్)              6335