• Home »
  • Entertainment »
  • మీడియా ఉద్యోగులకు మూవీస్ నౌ క్విజ్ పోటీ

మీడియా ఉద్యోగులకు మూవీస్ నౌ క్విజ్ పోటీ

హై రోలర్స్ పేరుతో పేరు మోసిన హాలీవుడ్ చిత్రాలను ప్రసారం చేయటానికి సిద్ధమైన మూవీస్ నౌ చానల్ ఆ కార్యక్రమానికి ప్రచారం కల్పించటంలో భాగంగా మీడియా, అడ్వర్టయిజింగ్ వృత్తి నిపుణులకోసం ఒక క్విజ్ పోటీ నడుపుతోంది. ఇందులో పాల్గొనాలనుకునే వారు ఇందుకోసం ప్రత్యేకంగా రూపొందించిన మైక్రో సైట్ లోకి లాగిన్ కావాలి. నటీ నటుల గురించి, సినిమాల గురించి, హాలీవుడ్ విశేషాలగురించి అడిగే ప్రశ్నలకు సమాధానాలివ్వాలి.

ఇందులో పాల్గొనేవారు ప్రతివారం 1 టెరాబైట్ హార్డ్ డ్రైవ్, సోనీ హెడ్ ఫోన్స్, జెబిఎల్ స్పీకర్స్ గెలుచుకునే అవకాశముంది. వారానికి 10 మంది విజేతలను ఎంపిక చేస్తారు. ఇలా మొత్తం నాలుగు వారాలపాటు పోటీ నడుస్తుంది. పాల్గొన్నవారిలో ముగ్గురికి ఐ ఫోన్ 6 ఇస్తారు. కేవలం వ్యక్తిగత బహుమతులే కాకుండా ఎక్కువమంది విజేతలు ఏ సంస్థకు చెందినవారైతే ఆ సంస్థకు కూడా బహుమతి ఉంటుంది.

ప్రతివారం సోమవారం నుంచి గురువారం వరకు రాత్రి 11 గంటలకు హై రోలర్స్ శీర్షికన ప్రసారమయ్యే చిత్రాలలో టేకెన్ 2, హారీ పోటర్ అండ్ ద డెత్లీ హాలోస్, ది వూల్ఫ్ ఆఫ్ వాల్ స్ట్రీట్, వాత్ హాపెన్స్ ఇన్ వేగాస్, మెన్ ఇన్ బ్లాక్, మిస్టర్ అండ్ మిసెస్ స్మిత్, సాల్ట్ లాంటి చిత్రాలుంటాయి. జార్జ్ క్లూనీ, బ్రాడ్ పిట్, ఏంజెలినా జోలీ, లియొనార్డో డి కాప్రియో లాంటి ప్రముఖులు నటించిన చిత్రాలను ప్రసారం చేయటానికి ప్రత్యేకంగా మూవీస్ నౌ ఈ ’ హై రోలర్స్’ ను చేపట్టింది.