• Home »
  • Uncategorized »
  • హాత్ వే ఆపేసినా రేటింగ్స్ తగ్గలేదు: సోనీ

హాత్ వే ఆపేసినా రేటింగ్స్ తగ్గలేదు: సోనీ

హాత్ వే తో సోనీ యాజమాన్యం మల్టీ స్క్రీన్ మీడియా ( ఎమ్ ఎస్ ఎమ్ ) వివాదం ఇప్పట్లో సమసిపోయేలా లేదు. హాత్ వే ప్రభావం రేటింగ్స్ మీద ఉంటుంది కాబట్టి తప్పకుండా సోనీ గ్రూప్ చానల్స్ వస్తాయని హాత్ వే నమ్మకంతో ఉండగా తాజా రేటింగ్స్ ప్రకారం హాత్ వే లేకపోయినా సోనీ చానల్స్ ప్రేక్షకాదరణ తగ్గలేదని తేలటంతో అదే విషయాన్ని ప్రకటిస్తూ సోనీ వెనక్కు తగ్గే ప్రసక్తే లేదన్న సంకేతమిచ్చింది.

గణనీయమైన సంఖ్యలో కనెక్షన్లున్న ఎమ్మెస్వో హాత్ వే సోనీ గ్రూప్ చానల్స్ ను స్విచాఫ్ చేయటంతో   సోనీ ఎంటర్టైన్మెంట్ టెలివిజన్ ( సెట్ ), మాక్స్, మాక్స్ 2, పాల్, పిక్స్ అండ్ కిక్స్ చానల్స్ హాత్ వే  ప్రేక్షకులకు అందటం లేదు. అయితే, అంతకుముందువారం కంటే తాజావారంలో ఈ చానల్స్ రేటింగ్స్ పెరిగినట్టి బార్క్ డేటా తెలియజేస్తోంది. హాత్ వే ఆపేయటం వలన ఆ చానల్స్ రేటింగ్స్ పడిపోయినట్టు హాత్ వే వ్యాఖ్యానించిన నేపథ్యంలో సోనీ గ్రూప్ ఈ సమాచారాన్ని విడుదలచేస్తూ, హాత్ వే లేకపోయినా పరవాలేదని ఇప్పుడు తమకు కనువిప్పు కలిగిందని వ్యాఖ్యానించింది.

“ హాత్ వే చందాదారుల పట్ల జాలి పడుతున్నాం. హాత్ వే తో సహా అందరి ఎమ్మెస్వోలతో మాకు సత్సంబంధాలున్నాయి. ప్రధాన ఎమ్మెస్వోలతీబాటు డిటిహెచ్ ఆపరేటర్ల తోనూ ఒప్పందాలు పూర్తయ్యాయి.  హాత్ వే జాయింట్ వెంచర్ భాగస్వాములనుంచి పెద్ద ఎత్తున ఫోన్ కాల్స్ వస్తున్నాయి. ప్రేక్షకుల డిమాండ్ కు తలొగ్గి హాత్ వే వస్తుందని భావిస్తున్నాం “  అన్నారు సంస్థ ఎగ్జిక్యుటివ్ వైస్ ప్రెసిడెంట్ మకరంద్ పాలేకర్

.