• Home »
  • Cable »
  • ఎమ్మెస్వోలూ, ఆపరేటర్లూ నచ్చిన మోడల్ ఎంచుకోవచ్చు: నెక్స్ట్ డిజిటల్

ఎమ్మెస్వోలూ, ఆపరేటర్లూ నచ్చిన మోడల్ ఎంచుకోవచ్చు: నెక్స్ట్ డిజిటల్

మూడోదశ డిజిటైజేషన్ ఇప్పుడిప్పుడే వేగం పుంజుకోబోతుండగా రంగ ప్రవేశం చేసిన హిందుజా వారి హిట్స్ ప్లాట్ ఫామ్ నెక్స్ట్ డిజిటల్ తన పథకాలను ప్రకటించింది. ఎమ్మెస్వోల స్వేచ్ఛా స్వాతంత్ర్యాలను కాపాడే విధంగా, వాళ్ళ నెట్ వర్క్ లు వాళ్ళకే ఉండే విధంగా రూపొందించిన ఈ మోడల్స్ అటు ఎమ్మెస్వోలకు, ఇటు ఆపరేటర్లకూ ఉపయోగపడేలా ఉన్నాయి.

డిజిటల్ ఎమ్మెస్వోగా లైసెన్స్ తీసుకున్నవారు వైట్ లేబుల్ సర్వీస్ తీసుకోవచ్చు. దీనివలన వాళ్ళే సొంతగా బ్రాడ్ కాస్టర్లతో ఒప్పందాలు కుదుర్చుకుంటారు. అలా కుదుర్చుకునే త్రైపాక్షిక ఒప్పందంలో నెక్స్ట్ డిజిటల్ కూడా ఉంటుంది కాబట్టి ఈ సంస్థే నేరుగా బ్రాడ్ కాస్టర్ కు చెల్లిస్తుంది.

డిజిటల్ ఎమ్మెస్వో లైసెన్స్ లేనివాళ్ళకు ఫుల్ సర్వీస్ మోడల్ అనుకూలంగా ఉంటుంది. ఇందులో నెక్స్ట్ డిజిటల్ త్రైపాక్షిక ఒప్పందం కుదుర్చుకుంటుంది. బ్రాడ్ కాస్టర్ కు నెక్స్ట్ డిజిటల్ చెల్లింపులు జరుపుతుంది. నిజానికి చిన్న చిన్న ఎమ్మెస్వోలకు ఇది అనుకూలంగా ఉంటుంది.

ఇక రెండు మోడల్స్ లోనూ కొన్ని ఉమ్మడి అంశాలున్నాయి. రెండు పద్ధతులలోనూ ఎమ్మెస్వో/ఆపరేటర్ సొంతగా సెట్ టాప్ బాక్సులు కొనుక్కుంటాడు. కస్టమర్లందరికీ విడివిడిగా ఎవరి బిల్లులు వాళ్ళకి తయారుచేసే బాధ్యత నెక్స్ట్ డిజిటల్ దే. అదే విధంగా ప్రతి ఆపరేటర్ కూ ఒక ప్రత్యేకమైన కోడ్ ఇస్తుంది. సెట్ టాప్ బాక్సులన్నిటినీ ఆ కోడ్ తో లాక్ చేయటం వలన వాటిని మార్చటం కుదరదు. కనెక్షన్లు ఇంకొకరు తీసుకోవటానికి వీల్లేదు.

 

ఏ మోడల్ ? వైట్ లేబుల్సర్వీస్ మోడల్ ఫుల్ సర్వీస్మోడల్
ఏది ఎవరికిఅవసరం? డిజిటల్ ఎమ్మెస్వో లైసెన్స్ ఉండాలిబ్రాడ్ కాస్టర్లతో ఒప్పందాలుండాలి డిజిటల్ ఎమ్మెస్వో లైసెన్స్ ఉండదు
రెండు మోడల్స్ మధ్యతేడా ఏంటి ? బ్రాడ్ కాస్టర్ తో , నెక్స్ట్ డిజిటల్ తో త్రైపాక్షిక ఒప్పందం కుదుర్చుకోవాలి,నేరుగా  బ్రాడ్ కాస్టర్ కు చెల్లించాలి నెక్స్ట్ డిజిటల్ త్రైపాక్షిక ఒప్పందం కుదుర్చుకుంటుందిబ్రాడ్ కాస్టర్ కు నెక్స్ట్ డిజిటల్ చెల్లిస్తుంది
రెండు మోడల్స్ లో ఉండేఉమ్మడి అంశాలు

 

ప్రీపెయిడ్ పద్ధతిలో ఆపరేటర్ సెట్ టాప్ బాక్సులు కొనుక్కుంటాడుకస్టమర్లందరికీ ఎవరి బిల్లు వారికి నెక్స్ట్ డిజిటల్ తయారుచేస్తుంది

ప్రతి ఆపరేటర్ కూ అతడి నెట్ వర్క్ కి ఒక ప్రత్యేకమైన కోడ్ ఉంటుంది.

బాక్సులన్నీ ఆపరేటర్ కోడ్ తో లాక్ చేయబడి ఉండటం వల్ల మార్చటం కుదరదు