• Home »
  • Cable »
  • తెలుగు రాష్ట్రాల్లో మూడోదశ డిజిటైజేషన్ లో ఎమ్మెస్వోల సెట్ టాప్ బాక్సులే ఎక్కువ

తెలుగు రాష్ట్రాల్లో మూడోదశ డిజిటైజేషన్ లో ఎమ్మెస్వోల సెట్ టాప్ బాక్సులే ఎక్కువ

మూడోదశ డిజిటైజేషన్ లో దేశ వ్యాప్తంగా ఎమ్మెస్వోల కంటే డిటిహెచ్ ఆపరేటర్లే ఎక్కువ సెట్ టాప్ బాక్సులు పెట్టినట్టు సమాచార, ప్రసార శాఖ అందించిన సమాచారాన్నిబట్టి తెలుస్తోంది. అయితే, తెలుగు రాష్ట్రాల్లో మాత్రం అందుకు భిన్నమైన పరిస్థితి ఏర్పడింది.

ఫిబ్రవరి 1 నాటికి మూడో దశలో మొత్తం 3 కోట్ల 52 లక్షల 10 వేల సెట్ టాప్ బాక్సులు అమర్చగా అందులో డిటిహెచ్ వాటా 2 కోట్ల 41 లక్షల 70 వేలు, ఎమ్మెస్వోల వాటా కోటీ 9 లక్షల 50 వేలు ఉంది. హిట్స్ ఆపరేటర్ అమర్చిన బాక్సులు 88వేల 791 మాత్రమే. దీంతో మూడో దశ కింద మొత్తం 86.82% మేరకు సెట్ టాప్ బాక్సులు పెట్టినట్టయింది.

అయితే, 625 మంది ఎమ్మెస్వోలకు గాని 290 మంది మాత్రమే డేటా అప్ లోడ్ చేశారని, డిటిహెచ్ ఆపరేటర్లలో మొత్తం ఆరుగురూ అప్ లోడ్ చేయగా. హిట్స్ ఆపరేటర్లు ఇద్దరిలో ఒకరు మాత్రమే అప్ లోడ్ చేశారు. అందరు ఎమ్మెస్వోలతోబాటు రెండో హిట్స్ ఆపరేటర్ కూడా డేటా అప్ లోడ్ చేస్తే పూర్తి సమాచారం అందుతుందని సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ అభిప్రాయపడింది.

ప్రభుత్వ సమాచారం ప్రకారం బీహార్, మహారాష్ట్ర, కర్నాటక, పంజాబ్, కేరళలో 100% బాక్సులు పెట్టటం పూర్తయింది. ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, ఒడిశా, గుజరాత్ రాష్ట్రాల్లో 90 శాతం పైగా పూర్తయింది. ఆంధ్రప్రదేశ్ లో 71.11 శాతం. మధ్యప్రదేశ్ లో 63శాతం, పశ్చిమబెంగాల్ లో 57% , నమోదు కాగా తమిళనాడు తెలంగాణ రాష్ట్రాలలో 40 శాతం లోపే సెట్ టాప్ బాక్సులు అమర్చారు.

  ఆంధ్ర ప్రదేశ్ తెలంగాణ మొత్తం
లక్ష్యం 24,53,928 18,19,556 42,73,484
డిటిహెచ్ సెట్ టాప్ బాక్సులు 7,33,443 2,87,268 10,20,711
హిట్స్ సెట్ టాప్ బాక్సులు 13,390 1,378 14,768
ఎమ్మెస్వో సెట్ టాప్ బాక్సులు 9,98,126 3,85,687 13,83,813
మొత్తం సెట్ టాప్ బాక్సులు 17,44,959 6,74,333 24 ,19,292
పెట్టిన బాక్సుల శాతం 71.11% 37.06% 56.61%

రెండు తెలుగురాష్ట్రాలతోబాటు హిమాచల్ ప్రదేశ్ లో మాత్రమే డిటిహెచ్ బాగా వెనుకబడి ఎమ్మెస్వోల సెట్ టాప్ బాక్సుల సీడింగ్ ముందుండటం విశేషం. రెండు తెలుగు రాష్ట్రాలలో కలిసి 56.61శాతం మాత్రమే బాక్సులు పెట్టటం పూర్తయింది.