• Home »
  • Cable »
  • రూ.108 కోట్ల సర్వీస్ టాక్స్ ఎగ్గొట్టిన కార్పొరేట్ ఎమ్మెస్వోలు

రూ.108 కోట్ల సర్వీస్ టాక్స్ ఎగ్గొట్టిన కార్పొరేట్ ఎమ్మెస్వోలు

గడిచిన మూడేళ్ళలో సర్వీస్ టాక్స్ ఎగ్గొట్టిన కార్పొరేట్ ఎమ్మెస్వోలకు ఆ శాఖ షో కాజ్ నోటీసులు జారీచేసింది. 2016 సెప్టెంబర్ వరకు ఈ సంస్థలు మొత్తం రూ. 108 కోట్ల 21 లక్షల మేరకు సర్వీస్ టాక్స్ ఎగ్గొట్టినట్టు కేంద్ర ఆర్థికశాఖ సహాయమంత్రి సంతోశ్ కుమార్ గంగ్వార్ లోక్ సభకు తెలియజేశారు. అయితే ఈ జాబితా కేవలం కోటి రూపాయలు మించి ఎగ్గొట్టిన వారి జాబితా మాత్రమేనని, పైగా షో కాజ్ నోటీస్ జారీ అయినవారి వివరాలు మాత్రమే పేర్కొన్నామని ఆర్థిక మంత్రిత్వశాఖ తెలియజేసింది.

2015-16 లో అత్యధికంగా రూ, 70 కోట్ల 35 లక్షల మేరకు సర్వీస్ టాక్స్ ఎగ్గొట్టినట్టు ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. ఆ జాబితాలోని ఆరుగురు ఎమ్మెస్వోలలో ఐఎమ్ సి ఎల్ ఒక్కటే రూ. 47 కోట్ల 77 లక్షలు ఎగ్గొట్టింది.  మొత్తం మూడు ఆర్థిక సంవత్సరాలలోనూ షో కాజ్ నోటీసు జారీ అయిన సంస్థ పూణెకు చెందిన ఐసిసి ఒక్కటే కావటం విశేషం.

రూ. కోటికి పైబడిన సర్వీస్ టాక్స్ ఎగవేత దారుల జాబితా ఇలా ఉంది.

సంఖ్య అర్థిక సంవత్సరం జోన్ పేరు అసెసీ పేరు మొత్తం (కోట్లలో)
1.  2014-15 బెంగుళూరు సెంట్రల్ ఎక్సైజ్ డబ్ల్యు ఇ పి సొల్యూషన్స్ 4.36
2. 2014-15 పుణె సెంట్రల్ ఎక్సైజ్ ఇంటర్మీడియా కేబుల్ కమ్యూనికేషన్ 3.49
3. 2014-15 పుణె సెంట్రల్ ఎక్సైజ్ ఇంటర్మీడియా కేబుల్ కమ్యూనికేషన్ 10.39
4. 2015-16 చండీఘడ్ సెంట్రల్ ఎక్సైజ్ మెస్సర్స్ ఆనంద్ ఎవర్ గ్రీన్, పాటియాలా 1.07
5. 2015-16 చెన్నై సర్వీస్ టాక్స్ మెస్సర్స్ జాక్ కమ్యూనికేషన్స్ 1.25
6. 2015-16 కొచ్చిన్ సెంట్రల్ ఎక్సైజ్ కేరళ కమ్యూనికేటర్స్ కేబుల్ లిమిటెడ్ 2.34
7. 2015-16 కోల్ కతా సర్వీస్ టాక్స్ జిటిపిఎల్ కోల్ కతా కేబుల్ పరిసేవ 9.42
8. 2015-16 ముంబయ్ సర్వీస్ టాక్స్ ఇండస్ ఇండ్ మీడియా, కమ్యూనికేషన్స్ 47.77
9. 2015-16 పుణె సెంట్రల్ ఎక్సైజ్ ఇంటర్మీడియా కేబుల్ కమ్యూనికేషన్ 8.50
10. 2016-17

(సెప్టెంబర్ దాకా)

చండీఘడ్ సెంట్రల్ ఎక్సైజ్ హిమాచల్ ఫ్యూచర్ కేబుల్ 2.33
11. 2016-17 కొచ్చిన్ సెంట్రల్ ఎక్సైజ్ కేరళ కమ్యూనికేటర్స్ కేబుల్ లిమిటెడ్ 4.50
12. 2016-17 కోల్ కతా సర్వీస్ టాక్స్ అడ్వాన్స్ డ్ మల్టిసిస్టమ్ బ్రాడ్ బాండ్ 10.06
13. 2016-17 పుణె సెంట్రల్ ఎక్సైజ్ ఇంటర్మీడియా కేబుల్ కమ్యూనికేషన్ 2.73

 

2016-17 ఆర్థిక సంవత్సరంలో సెప్టెంబర్ వరకు నాలుగు సర్వీస్ టాక్స్ ఎగవేత కేసులు నమోదయ్యాయి. ఎగవేత మొత్తం రూ. 19 కోట్ల 62 లక్షలుగా లెక్కగట్టారు.  2014-15 లో మాత్రం రెండు కంపెనీలు పన్ను ఎగ్గొట్టాయి. డబ్ల్యు ఇ ఇ సొల్యూషన్స్ సంస్థ రూ. 4  కోట్ల 36 లక్షలు ఎగ్గొట్టగా ఐసిసి సంస్థ రూ,13 కోట్ల 88 లక్షలు ఎగ్గొట్టింది.

ఫైనాన్స్ యాక్ట్ 1994 లోని నిబంధనలకు అనుగుణంగా ఆ కంపెనీల మీద చర్యలు తీసుకుంటున్నట్టు గంగ్వార్ లోక్ సభకు తెలియజేశారు. ఎగవేతలను అడ్డుకునే దిశలో  తమ శాఖ తమకు అందిన సమాచారం మేరకు కొన్ని సర్వేలు రిటర్న్ ల పరిశీలన, ఆడిట్, సోదాలు, దాడులు వంటివి చేస్తున్నట్టు కూడా వెల్లడించారు.