• Home »
  • Cable »
  • మూడో దశ డిజిటైజేషన్ మీద స్టే కారణంగా ఎమ్మెస్వోలూ నష్టపోతున్నారా?

మూడో దశ డిజిటైజేషన్ మీద స్టే కారణంగా ఎమ్మెస్వోలూ నష్టపోతున్నారా?

డిజిటైజేషన వలన కనెక్షన్ల కచ్చితమైన లెక్క తెలుస్తుందని, ఆవిధంగా పన్నుల ఆదాయం గణనీయంగా పెరుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది. అయితే, అంతకంటే ఎక్కువగా లాభపడేది మాత్రం బ్రాడ్ కాస్టర్లు. కేబుల్ కనెక్షన్ల సంఖ్య పెరిగితే ఆదాయం దానంతటదే పెరుగుతుంది. అందుకే డిజిటైజేషన్ వీలైనంత త్వరగా పూర్తికావాలని భావిస్తున్నారు. కానీ అదే సమయంలో ఎమ్మెస్వోలు కూడా ఆలస్యం చాలా నష్టం చేస్తుందని వాపోతున్నారు. వాయిదావేయాల్సిందిగా కోర్టును అడిగిందీ ఎమ్మెస్వోలే అయినా అందరి అభిప్రాయమూ ఇది కాదు.

కానీ ఇక్కడ గమనించాల్సిన విషయమేంటంటే, డిజిటైజేషన్ ఆలస్యమయ్యేకొద్దీ ఎమ్మెస్వోలు నష్టపోతున్నారు. భవిష్యత్తులో లాభాలు వస్తాయన్న నమ్మకంతోను, భారీ పెట్టుబడులు పెట్టి, సెట్ టాప్ బాక్సులకు సబ్సిడీలు ఇచ్చి , పే చానల్స్ తో ఒప్పందాలు కుదుర్చుకున్నప్పటికీ ఇంకా పాతరేట్లే అమలు చేయటం ఈ నష్టాలకు ప్రధాన కారణం. ఇప్పుడు కోర్టులు స్టే ఇవ్వటం వలన డిజిటైజేషన అమలులో మరింత ఆలస్యం జరుగుతోంది. ముందుగా వెసుకున్న అంచనాలన్నీ తల్లకిందులయ్యాయి.

సెట్ టాప్ బాక్సుల మెద సబ్సిడీ ఇవ్వకపోతే ప్రత్యర్థులు వ్యాపారాన్ని ఎగరేసుకుపోతారేమోనన్న భయంతో పెద్దమొత్తాల్లో పెట్టుబడులుఇ పెట్టాల్సి వచ్చింది. అదే సమయంలో డిజిటల్ హెడ్ ఎండ్ కోసం కూడా కోట్లాది రూపాయలు ఖర్చుపెట్టి ఉన్నారు. మరో వైపు బ్రాడ్ బాండ్ పంపిణీ ద్వారా లాభాలు సంపాదించవచ్చుననే ఆశతో మరికొందరు అదనపు  పెట్టుబడులు పెట్టారు. హాత్ వే లాంటి కార్పొరేట్ సంస్థలు మాత్రమే ఈ స్థాయిలో పెట్టుబడులు పెట్టగలుగుతున్నాయి తప్ప చిన్నా చితలా ఎమ్మెస్వోలందరూ చేతులెత్తేశారు.

అందుకే డిజిటైజేషన్ ఆలస్యమయ్యేకొద్దీ చిన్న ఎమ్మెస్వోలు తమ నెట్ వర్క్ లు అమ్ముకునే పరిస్థితి ఎదురవుతుందని. దాన్ని అవకాశంగా వాడుకోవాలని కార్పొరేట్ ఎమ్మెస్వోలు కాచుకు కూర్చున్నారు. ఒకవైపు సిటీ కేబుల్ లాంటి సంస్థలు తాము చాలా దూకుడుగా నెట్ వర్క్ ల కొనుగోళ్ళ మీద దృష్టిపెట్టి దూసుకుపోతున్నట్టు చెబుతున్నారు. ఇటీవలి కాలంలో ఒక్కో కనెక్షన్ కు రూ. 2,500 సగటు రేటున చెల్లించినప్పటికీ పోటీని బట్టి అవసరమైతే మరింత ఎక్కువ చెల్లించటానికీ సిద్ధంగా ఉన్నట్టు సిటీ కేబుల్ సూచనప్రాయంగా చెప్పింది కూడా.

మూడో దశ డిజిటైజేషన్ జరిగే మార్కెట్లో ఒక్కో యూనిట్ సగటు ఆదాయం రూ. 50 ఉంటుందని, అది క్రమంగా పెరుగుతూ రూ.75 కు చేరుకుంటుందని సిటీ కేబుల్ అంచనా. అదే సమయంలో కారేజ్ ఫీజు తగ్గుదల కూడా ఉంటుంది కాబట్టి మొత్తం ఆదాయం పెరుగుదల అంతంతమాత్రంగానే ఉండేట్టుంది.  కేవలం చందా ఆదాయాలమీదనే ఆధారపడాల్సి ఉండగా పాత చందాలే వసూలు చేయాల్సి రావటంతో నష్టాలు తప్పటం లేదంటున్నారు.

మూడో దశలో హాత్ వే దాదాపు 30 లక్షల బాక్సులు పెట్టినట్టు అంచనా. దీంతో దాదాపు కోటి బాక్సులు పూర్తి చేసుకుంది. డెన్ నెట్ వర్క్స్ కూడా అక్టోబర్-డిసెంబర్ మధ్య కాలంలో తొమ్మిదిన్నర లక్షల సెట్ టాప్ బాక్సులు అమర్చింది. దీంతో దీని కనెక్షనల సంఖ్య దాదాపు 85 లక్షలకు చేరింది. సిటీ కేబుల్ మూడో దశలోనే 31 లక్షల బాక్సులు అమర్చగలిగింది. గతంలో చందాదారు దరఖాస్తులు తీసుకోకుండానే సెట్ టాప్ బాక్సులు అమర్చినా, మూడో దశలో మాత్రం కచ్చితంగా దరఖాస్తు తీసుకున్నమీదటనే అమర్చినట్టు హాత్ వే చెబుతోంది.