• Home »
  • National Channels »
  • హోమ్ షాపింగ్ లో Naaptol రికార్డ్ : ఒకే రోజులో లక్షా 24 వేల ఆర్డర్లు

హోమ్ షాపింగ్ లో Naaptol రికార్డ్ : ఒకే రోజులో లక్షా 24 వేల ఆర్డర్లు

భారతదేశంలో హోమ్ షాపింగ్ లో Naaptol సరికొత్త రికార్డు నెలకొల్పి మొత్తం హోం షాపింగ్ పరిశ్రమనే దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ నెల 21 న ఒకే రోజు లక్షా 24 వేల ఆర్డర్లు సంపాదించటంతోబాటు రూ. 38 కోట్ల విలువచేసే స్థూల అమ్మకాలు కూడా సాధించగలిగింది. ఇంత పెద్ద ఎత్తున అమ్మకాలు జరపటంలో సైతం రికార్డు సాధించగలిగింది. సగటు లావాదేవీలలో 2.7% పెరుగుదల నమోదు చేసుకుంది. ఈ పరిశ్రమలో ఇతర పోటీదారుల కంటే ఇది చాలా ఎక్కువ.

ఇటీవలి కాలంలో నమోదవుతున్న ఈ అద్భుతమైన ఎదుగుదల సంస్థ అంకితభావానికి నిదర్శనంగా నిలిచినట్టు వ్యవస్థాపక సీఈవో మను అగర్వాల్ చెబుతున్నారు. ఈ కీలకమైన మైలురాళ్ళను చేరుకోవటంలో ప్రధాన సూత్రధారులైన ఖాతాదారులందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. నాణ్యత మీద దృష్టి సారిస్తూ, తక్కువ ధరలకే వస్తువులందిస్తూ ముందుకు సాగుతామని ఈ సందర్భంగా ప్రకటించారు.

ఈ నెల 14న ప్రారంభమైన Naaptol 8వ వార్షికోత్సవ అమ్మకాలు 28 వరకు కొనసాగుతాయి.  ఒక మహీంద్ర కారుతోబాటు 8  బైకులు, 8 వేల డ్యుయల్ సిమ్ ఫోన్లు బహుమతులుగా ఇస్తున్నట్టు ప్రకటించింది. రేయింబవళ్ళు కార్యకలాపాలు నిర్వహించటం, అద్భుతమైన పంపిణీ పద్ధతి,  వైవిధ్యభరితమైన వస్తువులు అందించటం  ప్రత్యేకతలుగా సాగుతున్న సంస్థ మరిన్ని ఆసక్తికరమైన పథకాలతో ఖాతాదారులకు దగ్గరయ్యే పనిలో ఉంది.