తమిళంలో ఎన్డీటీవీ గుడ్ టైమ్స్

ఎన్డీటీవీ గుడ్ టైమ్స్ ఇప్పుడు తమిళనాడుకు విస్తరించింది. అయితే, పూర్తి స్థాయి చానల్ గా కాకుండా నేషనల్ జాగ్రఫిక్, డిస్కవరీ లాంటి అంతర్జాతీయ చానల్స్ తరహాలో అదే ప్రసారం తమిళ ఆడియోతో అందుబాటులోకి వస్తుంది. అందువలన డబ్బింగ్ ఖర్చు మాత్రమే భరిస్తే సరిపోతుంది. మొదటిసారిగా ఇలా ప్రాంతీయ భాషలోకి ప్రవేశిస్తున్న ఎన్డీటీవీ గుడ్ టైమ్స్ దీని ఫలితాలనుబట్టి తెలుగు తదితర భాషల్లోనూ అందించాలని ఆలోచిస్తోంది.

ఇప్పుడు రసారమవుతున్న కార్యక్రమాలే తప్ప కొత్తగా కార్యక్రమాలేవీ ఉండవు. అయితే, చానల్ విజయవంతమయే పక్షంలో పూర్తి స్థాయి చానల్ గా ప్రసారాలు తీర్చిదిద్దటం గురించి ఆలోచిస్తామని చానల్ హెడ్ ఆరతీ సింగ్ చెబుతున్నారు. యువతరాన్ని ఆకట్టుకోవటంలో విజయం సాధించగలమని ధీమాతో ఉన్నారు. త్వరలో మిగిలిన ప్రాంతీయ భాషల్లో ప్రసారం మీద దృష్టిపెడతామన్నారు.