• Home »
  • National Channels »
  • త్వరలో తెలుగు, బెంగాలీ భాషల్లో NDTV గుడ్ టైమ్స్

త్వరలో తెలుగు, బెంగాలీ భాషల్లో NDTV గుడ్ టైమ్స్

ఈ మధ్యే తమిళంలో ప్రారంభమైన NDTV గుడ్ టైమ్స్ ఇప్పుడు వరుసగా ప్రాంతీయ భాషల్లోకి విస్తరించే పనిలో పడింది. ఇంగ్లిష్, హిందీ తరువాత తమిళంలో ప్రారంభించగా కొత్తగా తెలుగు, బెంగాలీ భాషల్లో కూడా చానల్ అందించాలని నిర్ణయించుకుంది.  లైఫ్ స్టైల్ కంటెంట్ ను విస్తృతంగా ప్రేక్షకులకు అందించాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు చానల్ హెడ్ ఆరతీసింగ్ చెబుతున్నారు.

పశ్చిమ దేశాల ప్రసారాలు డబ్బింగ్ చేయటం ఇష్టం లేదని, పూర్తిగా భారతీయ కార్యక్రమాలే రూపొందించుకుంటూ వచ్చిన తరువాత ఇప్పుడు వివిధ ప్రాంతీయభాషల్లోకి విస్తరిస్తున్నామన్నారు. ఇప్పటివరకు పెళ్ళిళ్ళమీద ఎక్కువగా దృష్టిపెట్టగా ఇకముందు ఫిట్ నెస్, వెల్ నెస్ మీద కార్యక్రమాలు రూపొందిస్తామని చెప్పారు. ఇలా ప్రాంతీయ భాషల్లోకి వెళ్ళటంతోబాటు డిజిటల్, మొబైల్ విభాగాలమీద కూడా దృష్టిపెడుతున్నట్టు ఆరతీ సింగ్ వెల్లడించారు.