• Home »
  • Entertainment »
  • వెయ్యికోట్ల పెట్టుబడుల సేకరణకు నెట్ వర్క్ 18 వాటాదారుల ఆమోదముద్ర

వెయ్యికోట్ల పెట్టుబడుల సేకరణకు నెట్ వర్క్ 18 వాటాదారుల ఆమోదముద్ర

వాటా మూలధనాన్ని రూ. 1000 కోట్లు పెంచుకోవటానికి నెట్ వర్క్ 18 కు ఆమోదముద్ర లభించింది. మూలధనం పెంపుకు వాటా దారుల అనుమతి తప్పనిసరి కావటంతో నెట్ వర్క్ 18 లాంఛనంగా ఆ కార్యక్రమాన్ని పూర్తి చేసుకుంది. సెప్టెంబర్ 28 న జరిగిన వార్షిక సర్వసభ్య సమావేశంలో కంపెనీ ప్రవేశ పెట్టిన ప్రత్యేక తీర్మానం మీద వాటాదారులు సానుకూలంగా వోటు వేశారు.

నన్-కన్వర్టబుల్ డిబెంచర్క్ల ద్వారా , విదేశీ కరెన్సీ కన్వర్టబుల్ బాండ్ల ద్వారా పెట్టుబడులు సేకరించటానికి ఆమోద ముద్ర లభించటంతో సంస్థ తలపెట్టిన విస్తరణ కార్యక్రమాలు వేగం పుంజుకుంటాయని భావిస్తున్నారు. ఈటీవీ గ్రూపు లోని అనేక చానల్స్ కొనుగోలు చేసిన నెట్ వర్క్ 18 ఇటీవలకాలంలో అతిపెద్ద నెట్ వర్క్ గా రూపొందిన సంగతి తెలిసిందే.