• Home »
  • BARC »
  • డాక్టర్ కలామ్ అంత్యక్రియలు,మెమన్ ఉరి: తెలుగులో తప్ప రేటింగ్స్ భారీ పెరుగుదల

డాక్టర్ కలామ్ అంత్యక్రియలు,మెమన్ ఉరి: తెలుగులో తప్ప రేటింగ్స్ భారీ పెరుగుదల

గత వారం దేశవ్యాప్తంగా న్యూస్ చానల్స్ రేటింగ్స్ గణనీయంగా పెరిగాయి. మొత్తంగా 82% పెరుగుదల నమోదైనట్టు బార్క్ రేటింగ్స్ సమాచారం తెలియజేస్తోంది. రాష్ట్రాల వారీగా చూస్తే తమిళనాడులో అత్యధికంగా 290% పెరుగుదల నమోదు కాగా తెలుగురాష్ట్రాల్లో మాత్రం 11% మాత్రమే పెరిగింది.

News Genre BARC

మాజీ రాష్ట్రపతి డాక్టర్ అబ్దుల్ కలామ్ కన్నుమూత మొదలు ఆయన అంత్యక్రియలవరకూ న్యూస్ చానల్స్ ఇచ్చిన కవరేజ్ ఒకవైపు, యాకూబ్ మెమన్ ఉరిచుట్టూ నెలకొన్న ఉత్కంఠ మరోవైపు ప్రేక్షకులను న్యూస్ చానల్స్ వైపు వచ్చేలా చేశాయి. సహజంగానే తమిళనాడు ప్రేక్షకులు కలాం కు ఘన నివాళి అర్పిస్తూ న్యూస్ చానల్స్ ప్రసారాలకు ఎక్కువగా మొగ్గు చూపారు. అయితే, తెలుగు న్యూస్ చానల్స్ లో మాత్రం చెప్పుకోదగిన పెరుగుదల కనబడలేదు.