• Home »
  • BARC »
  • నెం.1 స్థానంలో ఈటీవీ, 30% తక్కువ ప్రేక్షకాదరణతో జెమిని నాలుగో రాంక్ లో

నెం.1 స్థానంలో ఈటీవీ, 30% తక్కువ ప్రేక్షకాదరణతో జెమిని నాలుగో రాంక్ లో

ఫిబ్రవరి 20 నుంచి 26 వరకు సాగిన 8వ వారానికి గాను తెలుగు జనరల్ ఎంటర్టైన్మెంట్ చానల్స్ ప్రేక్షకాదరణ క్రమంలో పెద్దగా మార్పేమీ కనబడలేదు. అంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో నాలుగేళ్ళు పైబడిన ప్రేక్షకులందరినుంచి సేకరించిన శాంపిల్స్ ఆధారంగా బ్రాడ్ కాస్ట్ ఆడియెన్స్ రీసెర్చ్ కౌన్సిల్ ( బార్క్ ) ఈ సమాచారం వెల్లడించింది.

ఈటీవీ వరుసగా ఈ ఎనిమిదోవారం కూడా నెంబర్ వన్ స్థానంలోనే నిలిచింది.  అంతకంటే 9% తక్కువ ప్రేక్షకాదరణతో జీ తెలుగు రెండో స్థానంలో ఉండగా కొద్దిపాటి తేడాతో మా టీవీ ఈవారం కూడా మూడో స్థానానికే పరిమితం కావాల్సి వచ్చింది. ఈటీవీ కంటే దాదాపు 30 శాతం తక్కువ ప్రేక్షకాదరణతో జెమినీ నాలుగో స్థానంలోనే ఉండిపోయింది.