• Home »
  • Entertainment »
  • ఒకటి కంటే ఎక్కువసార్లు నియమాలు ఉల్లంఘించిన చానల్స్ లో ఎన్టీవీ

ఒకటి కంటే ఎక్కువసార్లు నియమాలు ఉల్లంఘించిన చానల్స్ లో ఎన్టీవీ

కార్యక్రమాల నియమావళిని ఉల్లంఘించిన ప్రైవేట్ శాటిలైట్ చానల్స్ మీద 2013 నుంచి 88 ఉల్లంఘనలు నమోదైనట్టు సమాచార, ప్రసారశాఖ సహాయమంత్రి రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ ఈ రోజు రాజ్యసభలో వెల్లడించారు. వాటిలో 13 సందర్భాలలో పిల్లలను చూపించటంలో నిబంధనలు ఉల్లంఘించినందుకు, రోడ్డు ప్రమాదాలను ఘోరంగా చూపినందుకు, సెన్సార్ సర్టిఫికేట్ చూపకుండా సినిమాలు ప్రదర్శించినందుకు సూచనపూర్వకమైన ఆదేశాలిచ్చారు.

ఉల్లంఘనలలో 2013 లో 32 , 2014 లో 22 , 2015 లో 23  నమోదు కాగా ఈ ఏడాది ఇప్పటివరకు 11 నమోదయ్యాయని చెప్పారు. ఈ ఉల్లంఘనల జాబితాలో ఒకటికంటే ఎక్కువ సార్లు కనిపించిన చానల్స్ లో మనోరంజన్ టీవీ, కలర్స్, ఎన్టీవీ, ఎఫ్ టీవీమ్ డివై 365, కామెడీ సెంట్రల్, రాజ్ న్యూస్ ఉన్నట్టు రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ వెల్లడించారు.