• Home »
  • Cable/DTH/HITS »
  • యాక్టస్ మానిటరింగ్ ప్లాట్ ఫామ్ ఏర్పాటు చేసుకున్న నెక్స్ట్ డిజిటల్

యాక్టస్ మానిటరింగ్ ప్లాట్ ఫామ్ ఏర్పాటు చేసుకున్న నెక్స్ట్ డిజిటల్

500 చానల్స్ తో ఇటీవలే ప్రారంభమైన హిందుజా గ్రూప్ వారి హిట్స్ వేదిక నెక్స్ట్ డిజిటల్ తాజాగా యాక్టస్ మానిటరింగ్ ప్లాట్ ఫామ్ ఏర్పాటు చేసుకుంది. దీనివలన అన్ని ఐపి ఆధారిత చానల్స్ నూ నమ్మకంగా రేయింబవళ్ళూ రికార్డు చేసుకునే వీలుంటుంది. పైగా, అదనపు చానల్స్ తోడైనప్పటికీ మరిన్ని చానల్స్ ను ఇముడ్చుకోగల సౌకర్యం యాక్టస్ లో ఉంది. ప్రస్తుత నిబంధనలకు అనుగుణంగ 350 ఐపి ఆధారిత చానల్స్ ను రికార్డు చేస్తూ పర్యవేక్షించవలసి ఉంటుంది.

యాక్టస్ మల్టీ ట్రాక్ ద్వారా అనేక ఆడియో ట్రాక్స్ రికార్డ్ రికార్డ్ చేసే అవకాశం ఉండగా యాక్టస్ ఎన్ కోడర్ ప్రో ద్వారా ఏ విధమైన ఆడియో, వీడియో సమస్యలు వచ్చినా వెంటనే అప్రమత్తం చేయగలుగుతుంది. కేవలం ప్రస్తుత అవసరాలకే కాకుండా డిజిటల్ ప్రపంచం శాసించే భవిష్యత్ అవసరాలు సైతం తీర్చగల సామర్థ్యం యాక్టస్ కు ఉందని గ్రాంట్ ఇన్వెస్ట్రేడ్ ఎండీ టోనీ డిసిల్వా చెబుతున్నారు.

ప్రపంచవ్యాప్తంగా సేవలందిస్తున్న యాక్టస్ ను ఈ ప్రీమియర్ సర్వీస్ కోసం ఎంపికచేయటానికి ముందు చాలా పెద్ద ఎత్తున కసరత్తు జరిగిందని, కాజిల్ మీడియా అనే కన్సల్టెన్సీ సంస్థ చివరికి దీన్ని ఎంపిక చేసిందని వివరించారు. హిట్స్ ప్రాజెక్ట్ అవసరాలకు పూర్తిగా అనుసంధానం కాగలిగే వ్యవస్థ యాక్టస్ కు ఉన్నట్టు తేలిందని చెప్పారు. ఎప్పటికప్పుడు ఏ అవసరం తలెత్తినా దాన్ని అమలు చేయగల సత్తా యాక్టస్ కి ఉందన్నారు.

ఎలాంటి అవసరాలకైనా యాక్టస్ తట్టుకుంటుందని రుజువు చేసుకోవటానికి తమ బృందాన్ని కస్టమర్ సైట్ కి పంపామని షాఫ్ సిబ్బంది సహకారంతో తాజా పరిజ్ఞానాన్ని సైతం ఇమడ్చగలిగామని మొదట్లో అనుకున్న బడ్జెట్ లోనే అదనపు సౌకర్యాలను సైతం అందించగలగటం పట్ల యాక్టస్ ప్రతినిధులు సంతృప్తి వ్యక్తం చేశారు.