• Home »
  • HITS »
  • NXT Digital ఖాతాలో డిస్నీ మీడియా: రెండేళ్ళ ఒప్పందం మీద సంతకాలు

NXT Digital ఖాతాలో డిస్నీ మీడియా: రెండేళ్ళ ఒప్పందం మీద సంతకాలు

హిందుజా వారి హిట్స్ వేదిక NXT Digital  తాజాగా డిస్నీ మీడియా డిస్ట్రిబ్యూషన్ సంస్థతో  ఒప్పందం కుదుర్చుకుంది. ఈ మధ్యనే ఇండియా కాస్ట్ నుంచి విడిపోయిన డిస్నీ స్వయంగా పంపిణీ చేస్తుండగా ఆ సంస్థ చానల్స్ ను తమ ప్లాట్ ఫీమ్ ద్వారా ఎమ్మెస్వోలకు, ఆపరేటర్లకు సరసమైన ధరలకు అందించే క్రమంలో NXT Digital  ఈ ఒప్పందం చేసుకుంది.

మొత్తం ఎనిమిది డిస్నీ చానల్స్ ఉండగా వీటన్నిటినీ చురుగ్గా పంపిణీ చెసేందుకు చురుకైన వేదికగా గుర్తించి ఒప్పందం చేసుకున్నట్టు డిస్నీ ప్రతినిధులు చెబుతున్నారు. ఒక్కో చందాదారులు చెల్లించాల్సిన మొత్తం ఆధారంగా ఈ ఒప్పందం కుదుర్చుకున్నట్టు NXT Digital  వెల్లడించింది.

ప్రాంతీయ చానల్స్ ను ఎక్కువగా కోరుకునే ఎమ్మెస్వోలు, ఆపరేటర్లకు అనుగుణంగా ప్రత్యేక పాకేజీలు రూపొందించిన NXT Digital  ఇప్పుడు మరిన్ని  వైవిధ్యభరితమైన చానల్స్ ను అందించే క్రమంలో ఇలాంటి ఒప్పందాలు చేసుకుంటూ వస్తోంది.