• Home »
  • Cable »
  • నెక్స్ట్ డిజిటల్ జాతీయ స్థాయిలో తొలి ఒప్పందం తెలంగాణనుంచే

నెక్స్ట్ డిజిటల్ జాతీయ స్థాయిలో తొలి ఒప్పందం తెలంగాణనుంచే

Sreekumar and Tony

హిందుజా వారి నెక్స్ట్ డిజిటల్ లాంఛనంగా ప్రకటించిన మరుసటిరోజే ఒప్పందం కుదుర్చుకోవటం ద్వారా తెలంగాణ ఎమ్మెస్వో  యావత్ భారతదేశంలో అలా ఒప్పందం చేసుకున్న తొలి ఎమ్మెస్వోగా గుర్తింపు పొందారు. ఖమ్మం ఎమ్మెస్వో వెంకట్ కు ఆ మొదటి గుర్తింపు లభించగా రెండో ఒప్పందం చేసుకున్న ఎమ్మెస్వోగా కరీంనగర్ జిల్లా పెద్దపల్లి ఎమ్మెస్వో సదానందం కావటం విశేషం.

తెలంగాణ రాష్ట్రంతోబాటు రాయలసీమ కు హిందుజా నెక్స్ట్ తరఫున స్టేట్ హెడ్  గా ఉన్న  శ్రీకుమార్ తన పరిధిలో ఎమ్మెస్వోలకు నెక్స్ట్ డిజిటల్ పట్ల అవగాహన కలిగించి ఒప్పందాలు చేయించిన సందర్భంగ సంస్థ సీఈవో టోఈనీ డి సిల్వా ముంబయ్ లో జరిగిన కార్యక్రమంలో కేక్ కట్ చేయించి ప్రత్యేకంగా అభినందించారు.

ఇలా ఉండగా, నేరుగా ఊరూరా ఎమ్మెస్వోలను, ఆపరేటర్లను కలిసి నెక్స్ట్ డిజిటల్ పట్ల అవగాహన పెంచేందుకు మరో వారంలో రోడ్ షోలు నిర్వహించటానికి కూడా సంస్థ ఏపాట్లు చేస్తోంది.