• Home »
 • Cable TV »
 • కేబుల్ ఆపరేటర్ కు అందుబాటు ధరలో నానో కోప్ ప్రారంభించిన NXT Digital

కేబుల్ ఆపరేటర్ కు అందుబాటు ధరలో నానో కోప్ ప్రారంభించిన NXT Digital

భారతదేశపు అతిపెద్ద డిజిటల్ టీవీ పంపిణీ వేదిక NXT Digital మరో విప్లవాత్మక నిర్ణయం తీసుకుంది. సామాన్య కేబుల్ అపరేటర్ పెట్టుబడి స్తోమతకు తగినట్టుగా అతడి స్వతంత్రతను కాపాడగలిగేలా సరికొత్త నానో కోప్ ప్రారంభించింది. కేబుల్ డిజిటైజేషన్  ప్రక్రియనే విప్లవాత్మకం చేస్తూ రూపొందించిన ఈ పరికరాల వ్యవస్థ జాతీయ స్థాయిలో ఆవిష్కారానికి ఖమ్మం వేదిక కావటం విశేషం.

దేశమంతటా NXT Digital విస్తృతమైన సేవలందిస్తూ ఘన విజయం సాధించిన సందర్భంగా హిందుజా మీడియా గ్రూప్ ఈ రోజు ఖమ్మంలో విజయోత్సవాలు జరుపుకుంది. అందులో భాగంగా ఈ నానో కోప్ ను ఆవిష్కరించింది. తెలంగాణ రాష్ట్రం నలుమూలలనుంచి 300 మందికి పైగా కేబుల్ ఆపరేటర్లు తరలి వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మార్కెట్ లో అందుబాటులో ఉన్న అన్ని పంపిణీ వేదికలలోనూ తక్కువ ఖర్చుతో అత్యంత నాణ్యమైన ప్రసారాలు అందించే వేదికగా NXT Digital కు మరే ఇతర పంపిణీ సంస్థలూ సాటి రావన్న విషయాన్ని ధ్రువీకరిస్తూ కేబుల్ వ్యాపార నిర్వాహకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

శాటిలైట్, ఫైబర్ ఆధారిత హైబ్రిడ్ ప్రాజెక్టుగా ప్రారంభమైన హిందుజా మీడియా గ్రూప్ వారి హెడ్ ఎండ్ ఇన్ ద స్కై (హిట్స్) వేదిక NXT Digital ఇప్పుడు దేశవ్యాప్తంగా తన పంపిణీ వేదికను ఏర్పాటు చేస్తూ విజయవంతంగా ముందుకు సాగుతోంది. ఇప్పటికే 18 లక్షల ఇళ్ళకు చేరుకుంది. ఆ విధంగా దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలోను, అండమాన్ నికోబార్ దీవులు లక్షదీవులు సహా నాలుగు కేంద్రపాలిత ప్రాంతాల్లోనూ 700 ప్రదేశాలలో తన ఉనికిని చాటుకుంది. ఇదంతా కేవలం తన వ్యాపార కార్యకలాపాలు ప్రారంభించిన 18 నెలల్లోనే జరగటం విశేషం.

హిందుజా మీడియా గ్రూప్ ఎండీ,  సీఈవో శ్రీ అశోక్ మన్ సుఖానీ ఈ సందర్భంగా మాట్లాడుతూ “ దేశవ్యాప్తంగా వీస్తున్న డిజిటైజేషన్ పవనాలను అద్బుతంగా ఆకళింపు చేసుకొని కాలానికి తగినవిధంగా వ్యవహరించటంలో ముందున్నాం. అందుకే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం వాడుకుంటూ స్థానిక కేబుల్ ఆపరేటర్లు, ఎమ్మెస్వోలు తమ నెట్ వర్క్ వ్యాపారాన్ని సురక్షితంగా కాపాడుకోవటానికి ఒక విశిష్టమైన డిజిటల్ పంపిణీ వేదికను రూపొందించి అతి తక్కువ ధరకే అందించగలిగాం. ఎక్కువ నాణ్యత, తక్కువ ధర, వ్యాపారంలో స్వతంత్రత ఇచ్చే ఏకైక సంస్థగా అభిమానం పొందగలిగాం.

యావత్ భారతదేశం డిజిటైజేషన్ దిశగా పయనిస్తూ ఒక సవాలును ఎదుర్కోబోతున్నప్పుడు చందాదారులందరూ ఆ సవాలును తమకు అనుకూలంగా మార్చుకొని లాభపడటానికి NXT Digital  తనదైన వ్యూహంతో ముందుకొచ్చింది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, నిరాటంకంగా దృశ్య ప్రసారం, ఎలాంటి వాతావరణాన్నైనా తట్టుకొని నిరంతరాయంగా ప్రసారాలు అందించటం, చందాదారుడు వెచ్చించే ప్రతి పైసాకు తగిన ప్రతిఫలం, అద్భుతమైన దృశ్య నాణ్యతతో కనువిందు చేయటం లక్ష్యంగా విజయం సాధించి మన్ననలందుకుంటూ ఉంది” అన్నారు.

భారత డిజిటైజేషన్ విప్లవంలో ఔత్సాహికులైన సొంత వ్యాపారులను  తన పరికరాల వ్యవస్థ,  సేవల ద్వారా బలోపేతం చేసి ముందుకు నడిపించటాన్ని NXT Digital  ఒక బాధ్యతగా, ఒక వ్యాపార అవకాశంగా తలకెత్తుకుంది. వచ్చే ఒకటీ, రెండేళ్ళ కాలంలో ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే గ్రామీణ ప్రాంతాల్లో 500 మందికి పైగా కేబుల్ వ్యాపారులను తీర్చిదిద్దాలని, తద్వారా 10 వేలమందికి పైగా ఉపాధి కల్పించాలని లక్ష్యంగా పెట్టుకుంది. అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన దృశ్యనాణ్యతతో ప్రేక్షకులకు కనువిందు చేసే ప్రసారాలు అందిస్తామని, సరసమైన ధరలతో సులువైన చెల్లింపు విధానం, ప్రీపెయిడ్ విధానం ద్వారా ఆదాయానికి భద్రత కల్పిస్తూ డిజిటల్ టీవీ మార్కెట్ లో ఒక సరికొత్త అధ్యాయాన్ని లిఖించటానికి శ్రీకారం చుట్టినట్టేనని NXT Digital  ఈ సందర్భంగా హామీ ఇచ్చింది.

ఈ సరికొత్త డిజిటల్ టీవీ విప్లవంలో భాగస్వాములయ్యే ప్రేక్షకుల కోసం :

 1. 500 కు పైగా చానల్స్ మీ ఆపరేటర్ దగ్గర అందుబాటులో ఉంటాయి గనుక ఎంచుకునే స్వేచ్ఛ, వాటిని మార్కెట్ అవసరాలకు అనుగుణంగా పాకేజీలుగా అందుకునే అవకాశం
 2. ఎలాంటి వాతావరణంలోనైనా నిరాటకంగా ప్రసారాల అనుభూతి ఆస్వాదించే అవకాశం; ఉరుములు, పిడుగులు, భారీవర్షాలకు మూగబోని టీవీ
 3. స్థానిక కార్యక్రమాలతో మీ లోకల్ టీవీ చానల్స్  చూసుకునే అవకాశం, ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా స్థానిక చానల్స్ కూడా ఎన్ క్రిప్ట్ అయ్యాక అందుకునే సౌకర్యం
 4. ఎలాంటి ఇబ్బందులూ లేకుండా సులభంగా చెల్లింపులు జరపటానికి అనేక మార్గాలు అందుబాటులో ఉండటం
 5. సరళమైన విధానాలు, డబ్బు చెల్లించి సేవలందుకునే వెసులుబాటు
 6. రేయింబవళ్లూ అన్ని విధాలైన సహకారం

సరికొత్త నానో కోప్ విశిష్ట లక్షణాలు

 • అందుబాటులో ఉండే ధర ( సుమారు 5 లక్షలు)
 • 500 కనెక్షన్లు ఉన్న ఆపరేటర్లకు సైతం ఇది చౌకధర
 • ప్రధానమైన తెలుగు పే చానల్స్ తోబాటు 95% న్యూస్ చానల్స్ అందుబాటు
 • తక్కువ కరెంట్ వాడకం
 • సులభంగా హెచ్ డి కి మార్చుకునే అవకాశం
 • లోకల్ చానల్స్ నడుపుకునే అవకాశం ( 16 వరకూ )
 • ఒకేసారి రెండు నెట్ వర్క్స్ నుంచి ఫీడ్ తీసుకొని కూడా నడుపుకునే సౌకర్యం (ఇప్పుడున్న నెట్ వర్క్ నుంచి హఠాత్తగా ఒకేరోజు మారాల్సిన అవసరం లేకుండా మెల్లగా NXT Digital కు మారవచ్చు)

డిజిటల్ వేదిక వ్యాపారంలో ఎదగాలనుకునే స్వతంత్ర భావాలున్న ఆపరేటర్లకోసం:

 • ఒక స్వతంత్ర వ్యాపారిగా ఉంటూ మీరు NXT Digital అందించ్ డిజిటల్ వీడియో/ప్రీపెయిడ్ వీడియో తో బాటు బ్రాడ్ బాండ్ సేవలు కూడా అందుకోవచ్చు. వీటన్నిటికీ NXT Digital మీకు వెన్నుదన్నుగా నిలుస్తుంది.
 • భవిష్యత్తులో అత్యంత పోటీ వాతావరణం ఉంటుంది కాబట్టి చిన్న అనలాగ్ ఆపరేటర్ కూడా NXT Digital  అందించే అండతో ఒక చిన్నపాటి కార్పొరేట్ సంస్థలా గట్టిగా నిలదొక్కుకోవటానికి ఇది సరైన అవకాశం
 • ఆయా రాష్ట్రాల మార్కెట్ అవసరాలకు తగినట్టుగా పాకేజీలు, బొకేలు తయారు చేసుకునే బండ్లింగ్ అవకాశం, స్థానిక ఆపరేటర్ కు ప్రయోజనకరంగా ఉంటుంది.

నానో కోప్ ఆవిష్కరణ కార్యక్రమం అనంతరం ఈ సందర్భంగా జరిగిన మీడియా  సమావేశంలో మీడియా ప్రతినిధులు అడిగిన అనేక ప్రశ్నలకు రీజినల్ హెడ్ శ్రీకుమార్ సమాధానాలు చెప్పారు. సరికొత్త నానో కోప్ ప్రత్యేకతలు, గ్రామీణ ప్రాంతాల్లో దాని ప్రాధాన్యతను వివరించారు.

 

టీవీ వార్తలకోసం :