• Home »
  • Cable/DTH/HITS »
  • కర్నూల్ లో రేపు నెక్స్ట్ డిజిటల్ సమావేశం

కర్నూల్ లో రేపు నెక్స్ట్ డిజిటల్ సమావేశం

హిందుజా గ్రూప్ వారి హిట్స్ ప్లాట్ ఫామ్ ’ నెక్స్ట్ డిజిటల్ ’ అధికారికంగా ప్రారంభించినప్పటినుంచీ వేగం పుంజుకోగా తొలిదశలోనే తెలంగాణ రాష్ట్రం మీద దృష్టి సారించింది. జాతీయ స్థాయిలో మొదటి రెండి ఎమ్మెస్వో ఒప్పందాలు చేసుకోవటంతో బాటు హైదరాబాద్ లో జరిపిన సమావేశం విజయవంతం కావటం రెట్టింపు ఉత్సాహాన్నిచ్చింది. ఇదే క్రమంలో రాయలసీమలో వేగం పెంచటానికి రేపు కర్నూలు లో  సమావేశం ఏర్పాటు చేశారు.

హైదరాబాద్ లో హోటల్ మారియట్ లో నిర్వహించిన అవగాహనా సమావేశానికి బృందాల వారీగా ఎమ్మెస్వోలు హాజరయ్యారు. సాంకేతిక అంశాలు, యాజమాన్యం, పెట్టుబడి, లాభదాయకత, అకౌంటింగ్ లాంటి అంశాలన్నీ వివరించటంతోబాటు ఎమ్మెస్వోలు వ్యక్తం చేసిన అనుమానాలన్నిటికీ సంతృప్తికరమైన సమాధానాలిచ్చారు. పైగా సమావేశస్థలంలోనే అరడజన్ ఒప్పందాలు జరగటం, వారం లోగా మరికొందరు ఒప్పందాలకు సిద్ధపడటాన్ని బట్టి చూస్తే నెక్స్ట్ డిజిటల్ వేగంగా దూసుకుపోతున్నట్టు స్పష్టంగా కనబడుతోంది.

ఇలా ఉండగా ఇదే వేగాన్ని కొనసాగించే క్రమంలో ఆంధ్రప్రదేశ్ లోని రాయలసీమ ప్రాంతంలోనూ సమావేశం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. రేపు కర్నూలు లో జరిగే సమావేశం సైతం  హైదరాబాద్ తరహాలోనే ఎమ్మెస్వోలను విశేషంగా ఆకట్టుకుంటుందని భావిస్తున్నారు.