• Home »
  • Cable/DTH/HITS »
  • 10 నగరాల్లో 6 వేల మంది ఆపరేటర్లతో భేటీ: రేపు విశాఖలో నెక్స్ట్ డిజిటల్ రోడ్ షో

10 నగరాల్లో 6 వేల మంది ఆపరేటర్లతో భేటీ: రేపు విశాఖలో నెక్స్ట్ డిజిటల్ రోడ్ షో

హిందుజా వారి హిట్స్ ప్లాట్ ఫామ్ “  నెక్స్ట్ డిజిటల్ “ దేశవ్యాప్తంగా కేబుల్ ఆపరేటర్లను, స్వతంత్ర ఎమ్మెస్వోలను కలుసుకునేందుకు ఒక భారీ ప్రచార యాత్ర చేపట్టింది. ఇప్పటివరకు 10 నగరాలలో 6 వేల మంది ఆపరేటర్లను ముఖాముఖి కలుసుకోగా రేపు విశాఖలో జరగబోయేది 11 వ సమావేశం. నెక్స్ట్ డిజిటల్ పనితీరును వివరించటంతో బాటు భవిష్యత్తు గురించి తెలియజేయటమే  ధ్యేయంగా  ఈ వరుస సమావేశాలు జరుగుతున్నాయి.

రేపు విశాఖలో జరిగే సమావేశంతో తొలివిడత పర్యటన పూర్తవుతుందని, ఆపరేటర్లనుంచి అనూహ్యమైన స్పందన కనిపిస్తున్నదని  గ్రాంట్ ఇన్వెస్ట్రేడ్ ఎండీ టోనీ డిసిల్వా చెబుతున్నారు. స్వతంత్రత, లాభదాయకత అనే రెండు అంశాలు బాగా ఆకట్టుకుంటున్నాయని, పైగా ప్రభుత్వ నియమాలను ఎక్కడా ఉల్లంఘించకుండా ఉండటం, ప్రసారాల నాణ్యత కాపాడటం ప్రత్యేకతలుగా ఉండిపోతాయని ధీమా వ్యక్తం చేశారు.