• Home »
  • Cable/DTH/HITS »
  • రేపు నెక్స్ట్ డిజిటల్ నానో కోప్ ప్రారంభం : ఖమ్మంలో జాతీయ స్థాయి ఆవిష్కరణ

రేపు నెక్స్ట్ డిజిటల్ నానో కోప్ ప్రారంభం : ఖమ్మంలో జాతీయ స్థాయి ఆవిష్కరణ

హిందుజా గ్రూప్ వారి హిట్స్ వేదిక నెక్స్ట్ డిజిటల్ సరికొత్తగా కేబుల్ ఆపరేటర్ ఆవరణ పరికర వ్యవస్థ ( కోప్) ను రూపొందించింది. అనూహ్యమైన తక్కువ ధరలో అందుబాటులో ఉండే ఈ వ్యవస్థ ద్వారా చిన్న చిన్న నెట్ వర్క్స్ ను సైతం తన పరిధిలోకి ఆహ్వానించటానికి సిద్ధమైంది. బ్రాడ్ బాండ్ ద్వారా ఫీడ్ తీసుకోవాల్సిన అవసరం గాని, సొంత చానల్స్ నడుపుకోవటంలో ఇబ్బందులు పడాల్సిన అవసరం గాని లేకుండా ఈ కోప్ రూపొందించినట్టు నెక్స్ట్ డిజిటల్ ప్రకటించుకుంటోంది.

కేవలం నాలుగున్నర లక్షల రూపాయలతో అందుబాటులోకి వచ్చే ఈ కోప్ కేబుల్ టీవీ డిజిటైజేషన్ లో ఒక విప్లవాత్మకమైన మలుపు అవుతుందని భావిస్తున్నారు. గ్రామీణ నెట్ వర్క్స్ స్వతంత్రతకు పెద్దపీటవేసే ఈ నానో కోప్ ను మంగళవారం మధ్యాహ్నం ఖమ్మంలో ఆవిష్కరించటంతోబాటు దాని పనితీరును కూడా ప్రదర్శించి చూపుతారని, దాదాపు 300 మంది ఆపరేటర్లు ఈ కార్యక్రమానికి హాజరవుతారని నెక్స్ట్ ప్రతినిధులు వెల్లడించారు.