• Home »
  • Broadband »
  • 2020 నాటికి ప్రతి 9 టీవీల్లో ఒకదానికి ఇంటర్నెట్

2020 నాటికి ప్రతి 9 టీవీల్లో ఒకదానికి ఇంటర్నెట్

టీవీ కనెక్షన్ ఉన్న ఇళ్ళలో ఇంటర్నెట్ సౌకర్యం పెరగబోతున్నట్టు డిజిటల్ టీవీ రీసెర్చ్ సంస్థ తన తాజా నివేదికలో వెల్లడించింది. 2010 లో 10 కోట్ల 5 లక్షల  ఇంటర్నెట్  కనెక్షన్లు ఉండగా 2015 చివరికల్లా 41 కోట్ల 50 లక్షల టీవీలకు. 2020 నాటికి 87 కోట్ల 60 లక్షలకు చేరుకుంటుందని అంచనావేసింది. 51 దేశాలలో జరిపిన సర్వే ఆధారంగా ఈ నివేదికను రూపొందించింది. 2010 వరకు 4.5% చొప్పున పెరుగుతూ వచ్చిన కనెక్షన్లు ఇప్పుడు 15.5% చేరుకోగా వచ్చే ఐదేళ్ళలో 29.9% పెరుగుదల నమోదు చేసుకుంటాయని తేల్చింది. ఒక్క దక్షిణ కొరియాలోనే ఈ పెరుగుదల 55 శాతం ఉంటుందని నివేదిక వెల్లడించింది.

మఓ వైపు భారతదేశంలో ఇది 11.4 % మాత్రమే ఉంటుందని, ఆవిధంగా ప్రతి 9 టీవీ కనెక్షన్లలో ఒకదానికి ఇంటర్నెట్ ఉంటుందని డిజితల్ టీవీ రీసెర్చ్ చెబుతోంది. 2020 నాటికి అమెరికా 18 కోట్ల 40 లక్షల ఇంటర్నెట్ టీవీ సెట్లు అందజేస్తుందని, రెండో స్థానంలో చైనా 14 కోట్ల 40 లక్షల సెట్లు అమ్ముతుందని పేర్కొంది. 2014-20 మధ్య చేరే అదనపు ఇంటర్నెట్ అనుసంధానిత టీవీలలో చైనా అత్యధికంగా 12 కోట్ల 30 లక్షలు సరఫరాచేస్తుంది. ఆ తరువాత స్థానంలో అమెరికా ఉండగా భారతదేశం 2 కోట్ల 90 లక్షలతో మూడో స్థానంలో ఉంది.