• Home »
  • Advertisement Code »
  • 10+2 ప్రకటనల నిబంధనలు కఠినంగా అమలు చేయండి: పార్లమెంటరీ కమిటీ

10+2 ప్రకటనల నిబంధనలు కఠినంగా అమలు చేయండి: పార్లమెంటరీ కమిటీ

వినియోగదారుల ప్రయోజనాలు కాపాడేలా టీవీ చానల్స్ ప్రకటనల పరిమితి ఉండాలని, పరిమితి దాట్ చానల్స్ మీద చర్యలు తీసుకోవాలని ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మీద ఏర్పాటైన పార్లమెంటరీ స్థాయీ సంఘం సమాచార, ప్రసార మంత్రిత్వశాఖను కోరింది. నిజానికి గంటకు 10 నిమిషాల వాణిజ్య ప్రకటనలు, 2 నిమిషాల సొంత కార్యక్రమాల ప్రచార ప్రకటనలు మాత్రమే ప్రసారం చేయాలని ట్రాయ్ నిర్దేశించింది. అయితే ఈ విషయం మీద బ్రాడ్ కాస్టర్లు కోర్టుకెళ్ళారు. ఇప్పుడు కోర్టులో ఉండగా దాన్ని చర్చించటం కోర్టు ధిక్కారమే అని తెలిసికూడా పార్లమెంటరీ స్థాయీ సంఘం ఇలా కోరటం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.

బిజెపి ఎంపీ అనురాగ్ ఠాకూర్ అధ్యక్షతన ఏర్పాటైన ఈ కమిటీ నివేదిక టీవీ కారక్రమాల్లో మితిమీరిన ప్రకటనలను తప్పుపట్టింది. లాభాలకోసం చానల్స్ అపరిమితంగా ప్రకటనలు ప్రసారం చేయటాన్ని అడ్డుకోవాలని తన 44 వ నివేదికలో సూచించింది. స్క్రోలింగ్ రూపంలో వచ్చే ప్రకటనలి కూదా మొత్తం తెరలో 10% మించకూడదని, తెరమీద నిలువుగా L ఆకారంలో వచ్చే ప్రకటనలు సైతం ఇకమీదట కనబడకూదదని చెప్పింది. తగిన చర్యలు తీసుకోవటంతోబాటు ఆ నివేదిక అందజేయాలని మంత్రిత్వశాఖను ఆదేశించింది.

టీవీ చానల్స్ కు చందాల ద్వారా వస్తున్న ఆదాయం దాదాపు రెట్టింపు కాగా ప్రకటనల ఆదాయం స్థిరంగా సుమారు 33% దగ్గరే ఉండిపోవటాన్ని ప్రస్తావిస్తూ చానల్స్ కూడా ఇప్పుడు చందా ఆదాయాలమీద ఎక్కువగా ఆధారపడుతున్నాయని కమిటీ వ్యాఖ్యానించింది. ఈ పరిస్థితుల్లో ప్రకటనల భారం మోపటం తగదని పేర్కొంది. అదే విధంగా 2012 తరువాత ప్రకటనల రహిత చానల్ ఒక్కటీ రాకపోవటాన్ని కూడా ప్రస్తావించింది.