మాజీ భాగస్వామిని కోర్టుకు లాగిన పతంజలి

స్వామి రామ్ దేవ్ బాబా ఆధ్వర్యంలోని పతంజలి ఆయుర్వేద్ సంస్థ తన మాజీ భాగస్వామి అయిన స్వామి కర్మవీర్ ను కోర్టుకు లాగింది. ట్రేడ్ మ్ర్క్, కాపీరిట్ చట్టాన్ని ఉల్లంఘించిన ఆరోపణమీద ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.

గతంలో రామ్ దేవ్ బాబా, ఆచార్య బాలకృష్ణ తో కలిసి దివ్య యోగ మందిరం నెలకొల్పిన కర్మవీర్  తన కల్పామృత్ బ్రాండ్ తో టూత్ పేస్ట్ మొదలుకొని షాంపూలు, పండ్ల రసాల దాకా అమ్ముతున్నారు. అయితే, ఆ ఉత్పత్తులు తమ ఉత్పత్తులకు అనుకరణ మాత్రమేనని అది ట్రేడ్ మార్క్, కాపీ రైట్ ఉల్లంఘన కిందికే వస్తుందని పతంజలి సంస్థ ఆరోపించింది.

ప్రాథమిక ఆధారాలను బట్టి తాత్కాలికంగా స్టే మంజూరు చేస్తున్నట్టు జస్టిస్ మన్మోహన్ ధర్మాసనం ఆదేశించింది. ఇలా మధ్యంతర ఊరట కల్పించకపోతే బాధితుడు నష్టపోయే ప్రమాదముందని ధర్మాసనం అభిప్రాయపడింది. తదుపరి విచారణ మే 7 వ తేదీకి వాయిదా పడింది.