• Home »
  • BARC »
  • టీవీ ప్రకటనల్లో నెం.1 “పతంజలి ఉత్పత్తులు”

టీవీ ప్రకటనల్లో నెం.1 “పతంజలి ఉత్పత్తులు”

దేశవ్యాప్తంగా టీవీ చానల్స్ ప్రకటనలలో అత్యధికంగా ప్రసారమవుతున్నది పతంజలి ఉత్పత్తులే. బాబా రామ్ దేవ్, ఆచార్య బాలకృష్ణ ఈ ఉత్పత్తులకు పెద్ద ఎత్తున ప్రచారం కల్పించి అదే స్థాయిలో అమ్మకాలు కూడ సాగిస్తున్నారు. దీంతో అనేక బహుళ జాతి సంస్థలకు ఎటూ పాలుపోవటం లేదు. తమ ఉత్పత్తులలో కూడా సంప్రదాయ దినుసులు ఉన్నాయంటూ ప్రచారం చేసుకోవటానికి ప్రాధాన్యమిస్తున్నాయి.

టీవీ చానల్స్ ప్రేక్షకాదరణను లెక్కించే బ్రాడ్ కాస్ట్ ఆడియెన్స్ రీసెర్చ్ కౌన్సిల్ (బార్క్) తాజాగా జులై 30- ఆగస్టు 5 తేదీల మధ్య వారానికి అందించిన సమాచారం ప్రకారం దేశవ్యాప్తంగా ఎక్కువ ప్రకటనలిస్తున్న ఉత్పత్తుల జాబితాలో పతంజలి సంస్థ నెంబర్ వన్ స్థానంలో ఉంది. మొత్తం దాదాపు 61 గంటల మేరకు పతంజలి ఉత్పత్తుల ప్రకటనలు ప్రసారమయ్యాయి. రెండో స్థానంలో ఉన్న పాండ్స్ 45 గంటలు మాత్రమే ప్రకటనలిచ్చింది.

రాంకుల వారీగా పతంజలి మొదటి స్థానంలో, పాండ్స్ రెండో స్థానంలో ఉండగా కాడ్ బరీ మూడో స్థానంలో, డోవ్ నాలుగో స్థానంలో ఉన్నాయి. ఫెయిర్ అండ్ లవ్లీ ఐదో రాంకు, కోల్గేట్ ఆరో రాంకు, ఎయిర్ టెల్ ఏడో రాంకు సంపాదించుకున్నాయి. సర్ఫ్, లాక్మే, సంతూర్ వరుసగా ఎనిమిది నుంచి పది స్థానాల్లో ఉన్నాయి.