• Home »
  • Audience »
  • అమెజాన్, ఫ్లిప్ కార్ట్ సహా 8 ఆన్ లైన్ సంస్థలలో పతంజలి ఉత్పత్తుల అమ్మకం

అమెజాన్, ఫ్లిప్ కార్ట్ సహా 8 ఆన్ లైన్ సంస్థలలో పతంజలి ఉత్పత్తుల అమ్మకం

బాబా రామ్ దేవ్ ఆధ్వర్యంలోని పతంజలి సంస్థ తన అమ్మకాలను మరింతగా పెంచుకునే క్రమంలో 8 ప్రముఖ ఆన్ లైన్ అమ్మకాల సంస్థలతో ఒప్పందం కుదుర్చుకుంది. అంటే, ఇక మీదట పతంజలి ఉత్పత్తులన్నీ పెద్ద ఎత్తున అమ్మకాలకు రంగం సిద్ధం చేసుకున్నట్టయింది. ఆ సంస్థలలో అమెజాన్, ఫ్లిప్ కార్ట్, పే టిఎం మాల్, 1ఎంజి,బిగ్ బాస్కెట్, గ్రోఫర్స్, షాప్ క్లూస్, స్నాప్ డీల్ ఉన్నాయి.

హరిద్వార్ కేంద్రంగా నడిచే ఈ సంస్థ ఈ నెల 16న జరిగే ఒక భారీ కార్యక్రమంలో ఆయా ఆన్ లైన్ సంస్థల ప్రతినిధులతో ఒప్పంద పత్రాలను మార్చుకోబోతున్నది. ప్రతి వినియ్గదారునికీ అందుబాటులో ఉండేలా చూడాలన్న నిర్ణయంతోనే ఈ ఒప్పందాలు కుదుర్చుకున్నట్టు సంస్థ ప్రతినిధి వెల్లడించారు. ఇప్పటికే సంస్థ స్వయంగా నడుపుకుంటున్న పతంజలి ఆయుర్వేద్ డాట్ నెట్ కు ఇవి అదనంగా చేరినట్టయింది. ఒప్పందానికి సంబంధించన పూర్తి వివరాలు ఇంకా వెల్లడించలేదు.