• Home »
  • Cable »
  • ఇంటర్ కనెక్ట్ ఒప్పందాలు: ఎమ్మెస్వోలతో చర్చల పట్ల పే చానల్స్ సంతృప్తి

ఇంటర్ కనెక్ట్ ఒప్పందాలు: ఎమ్మెస్వోలతో చర్చల పట్ల పే చానల్స్ సంతృప్తి

కొంతకాలంగా ట్రాయ్ ని ఇరకాటంలో పెడుతూ వచ్చిన ఇంటర్ కనెక్ట్ ఒప్పందాల వ్యవహారం ఒక కొలిక్కి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. డిజిటైజేషన్ మీద ఏర్పాటైన టాస్క్ ఫోర్స్  గత రెండు సమావేశాలలోనూ ఇదే విషయాన్ని చర్చించటం, పరిష్కార బాధ్యతను సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ అధికారులు ట్రాయ్ కి అప్పగించటం  తెలిసిందే.

ఈ నేపథ్యంలో స్టార్ ఇండియా, టీవీ 18 లాంటి పెద్ద గ్రూపుల ప్రతినిధులతో సహ అనేకమంది పే చానల్స్ ప్రతినిధులు ట్రాయ్ అధికారులను కలుసుకొని, ఎమ్మెస్వోలతో చర్చలు ఫలప్రదమవుతున్నాయని చెప్పారు. త్వరలోనే ఒప్పందాలు పూర్తవుతాయని కూడా ట్రాయ్ కి హామీ ఇచ్చారు. ఇలా ఉండగా, ఎమ్మెస్వోలు కూడా ట్రాయ్ అధికారులతో ఇదే అభిప్రాయం వ్యక్తం చేసినట్టు చెబుతున్నారు.