• Home »
  • Cable »
  • 349 కి చేరిన డిజిటల్ ఎమ్మెస్వోల సంఖ్య

349 కి చేరిన డిజిటల్ ఎమ్మెస్వోల సంఖ్య

సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ దగ్గర రిజిస్టర్ చేసుకున్న డిజిటల్ కేబుల్ ఎమ్మెస్వోల సంఖ్య 349 కి చేరింది. వీరిలో 126 మందికి తాత్కాలిక అనుమతి లభించింది. ఈ లైసెన్స్ పదేళ్ళ పాటు అమలులో ఉంటుంది. డిజిటైజేషన్ మూడో దశ పూర్తి కావటానికి ఇంకా ఐదు నెలలు మాత్రమే మిగిలి ఉండటంతో ప్రభుత్వం అనుమతులివ్వటం వేగవంతం చేసింది. మరోవైపు తాత్కాలిక లైసెన్సులకు సైతం అవకాశం కల్పించటంతో వీటి సంఖ్య గణనీయంగా పెరిగే అవకాశం కనిపిస్తోంది. ఇలా ఉండగా 29 మంది ఎమ్మెస్వోల లైసెన్సులు వివిధ కారణాలవలన రద్దయింది. హోంశాఖ క్లియరెన్స్ రాకపోవటం లేదా, లైసెన్సు నిబంధనల ప్రకారం హెడ్ ఎండ్ నెలకొల్పకపోవటం లాంటి కారణాలవల్ల రద్దుచేసినట్టు ప్రభుత్వం ప్రకటించింది.

జులైనుంచి లైసెన్స్ పొందిన ఎమ్మెస్వోలలో నెల్లూరు అర్బన్, నెల్లూరు రూరల్ కోసం ఎసిఎన్ కేబుల్ ప్రైవేట్ లిమిటెడ్, మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాలకోసం హనీ డిజి టెల్ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్, పశ్చిమ గోదావరి జిల్లాకోసం భీమవరం కమ్యూనిటీ నెట్ వర్క్ తరఫున ముదునూరి రాజగోపాల రాజు, చిత్తూరు జిల్లా రొంపిచెర్ల, చిన్నగొట్టిగల్లు, బాకరాపేట, సొదుం, సోమల, చౌడేపల్లి, కల్లూరు, దామల చెరువు, కలికిరి మండలాలకోసం భాగ్యలక్ష్మి కమ్యూనికేషన్ నెట్ వర్క్ కు, నల్గొండ, ఖమ్మం, వరంగల్, మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాల కోసం నార్కట్ పల్లికి చెందిన వన్ డిజిటల్ టీవీ సర్వీసెస్  ఉన్నట్టు సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ వెబ్ సైట్ వెల్లడించింది.