• Home »
  • Other Channels »
  • పిట్టీ గ్రూప్ ఆధ్వర్యంలో త్వరలో ఆధ్యాత్మిక చానల్ ’శుభ్ ’ టీవీ

పిట్టీ గ్రూప్ ఆధ్వర్యంలో త్వరలో ఆధ్యాత్మిక చానల్ ’శుభ్ ’ టీవీ

మహారాష్ట్రకు చెందిన పిట్టీ గ్రూప్ టీవీ రంగంలో అడుగుపెట్టింది. ముందుగా ఆధ్యాత్మిక చానల్ శుభ్ టీవీ ని ఈ రోజు ప్రారంభించింది. వచ్చే నెల నుంచి జరిగే కుంభమేళా మీద చానల్ ప్రధానంగా దృష్టి సారిస్తుందని సంస్థ చైర్మన్ కిషన్ కుమార్ పిట్టీ చెప్పారు. త్వరలో శుభ్ సినిమా ప్రారంభించి ఆధ్యాత్మిక దేశభక్తి ప్రభోదక చిత్రాలు ప్రసారం చేయాలని కూడా నిర్ణయించామని, అ తరువాత శుభ్ సంగీత్ కూడా ప్రారంభిస్తామని చెప్పారు.

ఆధ్యాత్మిక చానల్స్ లో ప్రకటనలు తక్కువగా ఉంటాయి కాబట్టి స్లాట్స్ అమ్మటం మీదనే దృష్టి సారిస్తున్నట్టు చెప్పారు. ఒక యాప్ ద్వారా కూడా చానల్ అందుబాటులో ఉండేట్టు చూస్తున్నామన్నారు. కేబుల్ తో బాటు డిష్ టీవీ, డిడి ఫ్రీడిష్ లో ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఈ చానల్ ను త్వరలో అన్ని డిటిహెచ్ ప్లాట్ ఫామ్స్ మీద పంపిణీ చేయాలని నిర్ణయించారు.