• Home »
  • Legal Issues »
  • సన్ టీవీ కేసులో నిర్ణయం అరుణ్ జైట్లీదే !?

సన్ టీవీ కేసులో నిర్ణయం అరుణ్ జైట్లీదే !?

కళానిధి మారన్ అధ్వర్యంలోని సన్ నెట్ వర్క్ భవిష్యత్తు ఇంకా అగమ్య గోచరంగానే ఉంది. సన్ నెట్ వర్క్ పరిధిలోని 33 చానల్స్ కు సెక్యూరిటీ క్లియరెన్స్ ఇవ్వటానికి హోం శాఖ నిరాకరించిన వ్యవహారం ఇంకా ఒక కొలిక్కి రాలేదు. అయినప్పటికీ ఈ విషయంలో ప్రధాని కార్యాలయం జోక్యం చేసుకోబోదని స్పష్టం చేయటం గమనార్హం. హోం మంత్రిత్వశాఖ నిర్ణయం తీసుకున్న తరువాత మళ్ళీ తన అభిప్రాయం ప్రత్యేకంగా చెప్పటం భావ్యం కాదని ప్రధాని భావిస్తున్నట్టు పి ఎం వో వెల్లడించించింది.

హోంశాఖామంత్రి రాజ్ నాథ్ సింగ్ కి సమాచార, ప్రసారాల శాఖామంత్రి అరుణ జైట్లీ ఒక లేఖ రాస్తూ, ఆ నిర్ణయాన్ని పునఃపరిశీలించుకోవాలని కోరారు. అయితే, ఎంతమాత్రమూ వెనకడుగు ప్రశ్నేలేదని రాజ్ నాథ్ తేల్చిచెప్పటంతో అటార్నీ జనరల్ అభిప్రాయం తీసుకున్నారు. హోంశాఖ సిఫార్సు సరికదని అటార్నీ జనరల్ చెప్పటంతో ఎటూ పాలుపోని అరుణ్ అజైట్లీ ప్రధాని సలహా కోసం ఆయనను కలుసుకున్నారు. మారన్ సోదరులు సిబిఐ విచారణ ఎదుర్కుంటున్నారన్న కారణంగా ఆ విషయంలో జోక్యం చేసుకోకూడదని ప్రధాని కార్యాలయం నిర్ణయించుకున్నటు తెలుస్తోంది. అయితే, ఇప్పుడు కీలక నిర్ణయం అరుణ్ జైట్లీ చేతుల్లో ఉంది.