• Home »
  • News »
  • లీజుకిచ్చే ఆలోచనలో ’రాజ్ న్యూస్ తెలుగు’

లీజుకిచ్చే ఆలోచనలో ’రాజ్ న్యూస్ తెలుగు’

తమిళనాడుకు చెందిన రాజ్ నెట్ వర్క్స్ సంస్థ తన తెలుగు న్యూస్ చానల్ ను మళ్ళీ లీజుకిచ్చే ఆలోచనలో ఉంది. గతంలో లీజుకు తీసుకున్న టీ న్యూస్ యాజమాన్యం ఆ తరువాత సొంత లైసెన్స్ తో చానల్ పెట్టుకున్న సంగతి తెలిసిందే. మధ్యలో కొంతమంది లీజుకు తీసుకోవటానికి ప్రయత్నించినా ఒప్పందం కుదరలేదు.

సొంతగానే పెద్ద ఎత్తున నడపాలని ఆలోచించిన రాజ్ యాజమాన్యం తెలుగు మార్కెట్ కు తగినట్టుగా వ్యవహరించటం సాధ్యం కాదని చేతులెత్తేసింది. విస్సా చానల్ తో తెలుగు ఎంటర్టైన్మెంట్ లో ప్రవేశించినా, దాని ఉనికి నామమాత్రంగానే కొనసాగింది. నిరుడు ఎన్నికలకు ముందు చానల్ డిస్ట్రిబ్యూషన్ కి సహకరించే ఒప్పందం మీద బిజెపి సాయం తీసుకుంది.

ఇప్పుడు మళ్ళీ లీజుకు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నట్టు చెబుతోంది. అయితే, ఎలాంటి షరతులు ఉంటాయో స్పష్టంగా చెప్పటం లేదు. గతంలో ఆదాయం పంచుకునే పద్ధతి ప్రతిపాదించినప్పుడు చాలామంది వెనకడుగేశారు. ఇపుడు జుబ్లీహిల్స్ లో సొంత భవనంలో తగిన ఎక్విప్ మెంట్ తో 24 గంటల న్యూస్ చానల్ నడపటానికి అన్ని విధాలా సరిపోతుందని చెబుతోంది.