• Home »
  • BARC »
  • టామ్, బార్క్ దేని దారి దానిదే: పొంతన కుదరని టీవీ రేటింగ్స్

టామ్, బార్క్ దేని దారి దానిదే: పొంతన కుదరని టీవీ రేటింగ్స్

తాజా రేటింగ్స్ లోనూ వివిధ చానల్స్ మధ్య పొంతన కుదరటం లేదు. బ్రాడ్ కాస్ట్ ఆడియెన్స్ రీసెర్చ్ కౌన్సిల్ ( బార్క్ ) విడుదల చేసిన సమాచారం ప్రకారం తెలుగు జనరల్ ఎంటర్టైన్మెంట్ చానల్స్ లో జెమిని టీవీ నెంబర్ వన్ స్థానం సంపాదించుకోగా  రెండో స్థానంలో మా టీవీ, మూడో స్థానంలో  జీ తెలుగు, నాలుగో స్థానంలో ఈటీవీ ఉన్నాయి. జెమినీ టీవీ లక్షా ఆరు వేల టివిటి లు సంపాదించుకోగా మా టీవీ 98436 టివిటిలు, జీ తెలుగు 98,276 టివిటిలు సంపాదించుకున్నాయి.

టామ్ రేటింగ్స్ ప్రకారం మాటీవీ ఈ వారం కూడా తన ఆధిక్యాన్ని కొనసాగిస్తూ మొదటి స్థానంలో ఉంది. అంతకు ముందు వారం వచ్చిన 616 జిఆర్పీలకంటే బాగా తగ్గి  ఈ సారి 545 జీఆర్పీలు మాత్రమే సంపాదించుకున్నప్పటికీ మొదటి స్థానం కొనసాగించింది. రెండో స్థానం జెమినీ టీవీకి దక్కింది. అంతకు ముందు వారం తెచ్చుకున్న 504 జీఆర్పీలకంటే ఈ సారి 2 జీఆర్పీలు మాత్రమే పెరిగి 506 కు చేరింది.

తమిళంలో బార్క్ సమాచారం ప్రకారం సన్ టీవీకి 292 టివిటి లు దక్కగా స్టార్ విజయ్ టీవీకి కేవలం 69 టివిటిలు, సన్ టీవీ వారి మూవీస్ చానల్  కె టీవీకి 81 టివిటిలు లభించాయి. టామ్ లెక్కల ప్రకారం కూడా సన్ టీవీ కి మొదటి స్థానం దక్కినా విజయ్ కి రెండో స్థానం వచ్చింది. బార్క్ సమాచారానికి ఇది కాస్త భిన్నంగా ఉంది. సన్ టీవీకి 1221 జీఆర్పీలు,  స్టార్ విజయ్ కి 346 జీఆర్పీలు వచ్చాయి.

కన్నడ మార్కెట్లో బార్క్ సమాచారం ప్రకారం  కలర్స్ కన్నడ తన మొదటి స్థానాన్ని నిలబెట్టుకుంటూ 62 టివిటి లు సంపాదిచుకుంది. రెండో స్థానంలో ఉన్న జీ కన్నడకు 41 టివిటిలు, మూడో స్థానంలో ఉన్న ఉదయ మూవీస్ కు 36 టివిటి లు దక్కాయి. టామ్ లెక్కలప్రకారం కూడా కలర్స్ కన్నడ 404 జీఆర్పీలతో  మొదటి స్థానంలోనే ఉంది. అయితే, జీ కన్నడ కు బదులుగా ఉదయ టీవీ 401 జీఆర్పీలతో రెండో స్థానంలో ఉంది. కలర్స్ కన్నడ, ఉదయ మధ్య తేడా టామ్ ,బార్క్ అంచనాల్లో చాలా ఎక్కువగా ఉండటం స్పష్టంగా కనిపిస్తుంది.

మలయాళంలో ఏషియానెట్ చానల్ 129 టివిటి లతో నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతుండగా మళవిల్ మనోరమ 52 టివిటి లతో రెండో స్థానంలోకి దూసుకొచ్చి 43 టివిటి లు తెచ్చుకున్న సూర్య టీవీని మూడో స్థానంలోకి పంపింది. టామ్ కూడా ఏషియానెట్ తిరుగులేని స్థానాన్ని ఖాయం చేస్తూ 890 జీఆర్పీలు ఇవ్వగా మళవిల్ మనోరమకు 224 జీఆర్పీలతో రెండో స్థానం ఇచ్చింది.