• Home »
  • DTH »
  • 50 లక్షల చందాదారుల మైలురాయి దాటిన రిలయెన్స్ డిజిటల్ టీవీ

50 లక్షల చందాదారుల మైలురాయి దాటిన రిలయెన్స్ డిజిటల్ టీవీ

రిలయెన్స్ కమ్యూనికేషన్స్ వారి డిటిహెచ్ విభాగం రిలయెన్స్ డిజిటల్ టీవీ ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో మరో లక్షమంది చందాదారులను చేర్చుకోవటంతో 50 లక్షల మైలురాయి దాటింది. దీంతో మొత్తం డిటిహెచ్ మార్కెట్ లో 6% వాటా దక్కించుకున్నట్టయింది. అయితే మొత్తం ఆరు ప్రైవేట్ డిటిహెచ్ సంస్థల్లోనూ రిలయెస్న్ తో అతి తక్కువ వాటా.

డిష్ టీవీ అతిపెద్ద డిటిహెచ్ ఆపరేటర్ గా కోటీ 40 లక్షల చందాదారులతో నెంబర్ వన్ స్థానంలో ఉంది. వీడియో కాన్ డిటిహెచ్ కి కోటీ 13 లక్షలు, ఎయిర్ టెల్ కి కోటీ 11 లక్షలు, టాటా స్కై కి 95 లక్షలు చందాదారులున్నట్టు అంచనాలు చెబుతున్నాయి. రిలయెన్స్ డిజిటల్ ప్రవేశ పెట్టిన సరికొత్త టెక్నాలజీ వల్ల 278 హెచ్ డి నాణ్యతతో చానల్స్ ఇచ్చే అవకాశం కల్పించింది.

రిలయెన్స్ వారి సెట్ టాప్ బాక్స్ విఫలమయ్యే శాతం 0.92 శాతం గా నమోదు కాగా 2015 జూన్ 30 నాటికి మొత్తం ఆరు డిటిహెచ్ ఆపరేటర్లు కలిసి నాలుగుకోట్ల ఇళ్ళకి ప్రస్తుతం సేవలందిస్తున్నట్టు ట్రాయ్ లెక్కలు చెబుతున్నాయి. అయితే మరో నాలుగు కోట్ల ఈళ్లకు కనెక్షన్లు ఉన్నప్పటికీ ప్రస్తుతం సేవలందిస్తున్నట్టు కూడా తెలుస్తోంది.