• Home »
  • Broadband »
  • 15 వేల కోట్ల సమీకరణలో రిలయెన్స్ జియో

15 వేల కోట్ల సమీకరణలో రిలయెన్స్ జియో

ఎంతో కాలంగా ఊరిస్తున్న 4జి మరో రెండు నెలల్లో ప్రారంభించబోతున్న రిలయెన్స్ జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్ ఇప్పుడు వాటాల జారీ ద్వారా 15 వేల కోట్లు సమీకరించేందుకు సిద్ధమవుతున్నది. కంపెనీ డైరెక్టర్ల బోర్డు ఈ మేరకు ఆమోద ముద్ర వేసింది.ఇప్పుడున్న వాటాదారులకే ఈ వాటాలు అమ్ముతారు.  మరోవైపు అనిల్ అంబానీకి చెందిన రిలయెన్స్ కమ్యూనికేషన్స్ తో స్పెక్ట్రమ్ పంచుకునే ఒప్పందం కూడా కుదుర్చుకోవటం గమనార్హం. రెండు కంపెనీలు తమ తమ సర్కిల్స్ రోమింగ్ ఏర్పాట్లను పరస్పరం ఇచ్చిపుచ్చుకునే పద్ధతిలో పంచుకుంటాయి.

800 మెగా హెర్ట్జ్ బాండ్ లో స్పెక్ట్రమ్ ఫుట్ ప్రింట్ వాడుకునే అవకాశం ఉండటం వలన రిలయెన్స్ జియో 4జి సేవలకు బలం చేకూరుతుంది. నెట్ వర్క్ కవరేజ్ పెరగటంతోబాటు  అత్యంత నాణ్యమైన సేవలు అందుతాయి. నెట్ వర్క్ పంచుకునే ఒప్పందం వలన మెట్ వర్క్ సామర్థ్యం పెరిగి స్పెక్ట్రమ్ ను గరిష్ఠంగా వాడుకోవటం, పెట్టుబడికి తగిన ప్రతిఫలం పొందటం సాధ్యమవుతుంది. నిర్వహణ వ్యయాన్ని కూడా ఇద్దరూ చాలా మేరకు ఆదా చేసుకోగలుగుతారు. రిలయెన్స్ కమ్యూనికేషన్స్ కస్టమర్లు కూడా రిలయెన్స్ జియో నెట్ వర్క్ లాభాలు పొందటానికి అవకాశం కల్పిస్తారు.

ప్రస్తుతం రిలయెన్స్ జియో దేశ వ్యాప్తంగా 29 రాష్ట్రాల్లో 18 వేల నగరాలు, పట్టణాలతోబాటు లక్ష గ్రామాలలో తన ఉనికిని చాటుకుంటూ విస్తరించి ఉంది. రిలయెన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఇప్పటికే రిలయెన్స్ జియో లో లక్షకోట్ల రూపాయల వరకు పెట్టుబడి పెట్టింది.