• Home »
  • Entertainment »
  • తెలుగు సహా దక్షిణాది భాషల్లో “సైరాట్”: రీమేక్ హక్కులు కొనుక్కున్న జీ గ్రూప్

తెలుగు సహా దక్షిణాది భాషల్లో “సైరాట్”: రీమేక్ హక్కులు కొనుక్కున్న జీ గ్రూప్

ఇటీవలి కాలంలో అత్యంత సంచలనాత్మక విజయం సాధించిన మరాఠీ చిత్రం సైరాట్ ను అన్ని దక్షిణాది భాషల్లో  రీమేక్ చేయటానికిజీ గ్రూప్  హక్కులు కొనుక్కుంది. జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ ప్రైజెస్ లిమిటెడ్ వారి నిర్మాణ సంస్థ ఎస్సెల్ విజన్ ప్రొడక్షన్స్ తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో ఈ చిత్రాన్ని రీమేక్ చేయబోతోంది.  నిర్మాత, పంపిణీదారుడు అయిన రాక్ లైన్ వెంకటేశ్ ను సహ నిర్మాతగా కూడా చేర్చుకుంది.

మరాఠీలో దర్శకత్వం వహించిన నాగరాజ్ మంజులే తెలుగు రీమేక్ కి కూడా దర్శకత్వ బాధ్యతలు నిర్వహిస్తారు. అదే విధంగా సంగీత దర్శకులు అజయ్, అతుల్ కూడా పనిచేస్తారు. అయితే, నటీనటులను మాత్రం కొత్తవాళ్ళను తీసుకుంటారు. తెలుగు షూటింగ్ సెప్టెంబర్ లో మొదలవుతుంది. ముందుగా తెలుగు, కన్నడ భాషల్లో నిర్మించి, ఆ తరువాత తమిళ, మలయాళ భాషల్లో తీయాలని నిర్ణయించుకున్నారు. తన తల్లిదండ్రులు తెలుగే మాట్లాడతారని, ఆ విధంగా తనకు తెలుసునని అంటున్నాడు దర్శకుడు మంజులే.