• Home »
  • MIB/Licencing »
  • సమాచార, ప్రసార శాఖ లైసెన్స్ మంజూరు: ప్రసారాలు ప్రారంభించిన సంగీత్ మరాఠీ

సమాచార, ప్రసార శాఖ లైసెన్స్ మంజూరు: ప్రసారాలు ప్రారంభించిన సంగీత్ మరాఠీ

మీడియా వరల్డ్ వైడ్ సంస్థకు చెందిన మరాఠీ మ్యూజిక్ చానల్ సంగీత్ మరాఠీకి సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ నుంచి అనుమతి లభించటంతో ప్రసారాలు ప్రారంభించింది. మరాఠీ చిత్ర గీతాలతో మహారాష్ట్ర ప్రేక్షకులను అలరించటానికి ఈ మ్యూజిక్ చాన;ల్ మొదలైంది. ప్రారంభ కార్యక్రమాలకు స్పాన్సర్ గా హిందుస్తాన్ లీవర్ వారి ఫెయిర్ అండ్ లవ్లీ నిలిచింది. ప్రారంభోత్సవానికి సంబంధించి కొద్దివారాలపాటు ప్రసారం చేసేందుకు అనేక కార్యక్రమాల పరంపర రూపొందించినట్టు చానల్ యాజమాన్యం ప్రకటించింది.

ఎంతో కాలంగా లైసెన్స్ కోసం ఎదురుచూస్తున్న సంస్థ సిబ్బంది ఇప్పుడు ఎట్టకేలకు ప్రారంభం కావటంతో ఉత్సాహంతో ఉన్నారు. హోర్డింగ్స్ సహా ఔట్ డోర్ పబ్లిసిటీ భారీగా చేపట్టాలని కూడా మీడియా వరల్డ్ వైడ్ నిర్ణయించుకుంది. సంస్థ ఆధ్వర్యంలో నడిచే ఇతర చానల్స్ ద్వారా కూదా ప్రచారం ముమ్మరం చేసినట్టు సంస్థ సీఈవో ప్రశాంత్ చోతానీ చెబుతున్నారు.