• Home »
  • DTH »
  • “ఫుడ్ ఫుడ్” సంజీవ్ కపూర్ తమిళ చానల్ “సమయల్ సమయల్” త్వరలో ప్రారంభం

“ఫుడ్ ఫుడ్” సంజీవ్ కపూర్ తమిళ చానల్ “సమయల్ సమయల్” త్వరలో ప్రారంభం

ఫుడ్ ఫుడ్ చానల్ అన్ని కష్టాలూ ఎదురొడ్డి ఇప్పుడు విస్తరణవైపు దృష్టి పెట్టింది. సెలెబ్రిటీ చెఫ్ సంజీవ్ కపూర్ ఆధ్వర్యంలోని టర్మరిక్ విజన్ ఆధ్వర్యంలో 2011 జనవరిలో ఫుడ్ ఫుడ్ చానల్ మొదలైంది. అయితే, అందులో కీలకమైన భాగస్వామిగా ఉన్నాఅస్ట్రో సంస్థ వైదొలగటంతో ఇబ్బందులు తప్పలేదు. ఆ తరువాత డిస్కవరీ కమ్యూనికేషన్స్ ఈ చానల్ ను కొనుగోలు చేయటానికి సిద్ధమైనప్పటికీ ఆ తరువాత అది కుదరలేదు. దీంతో బాగా ఇబ్బందుల్లో పడినా ఇప్పుడు కోలుకుంది.

టర్మరిక్ విజన్ సంస్థ త్వరలో రెండు ప్రాంతీయ భాషా చానల్స్ ప్రారంభించటం కోసం లైసెన్స్ కు దరఖాస్తు చేసుకుంది. ఒకటి తమిళ ప్రేక్షకులకోసం కాగా రెండోది హెచ్ డి  చానల్. ముందుగా వచ్చే  తమిళ్ చానల్ సైతం డబ్ చేసిన ప్రసారాలతో ఆడియో ఫీడ్ మాత్రమే మార్చుకొని ప్రసారమవుతుంది. డిటిహెచ్ ద్వారా  అందుబాటులోకి తీసుకువచ్చి ప్రేక్షకుల స్పందన తెలుసుకోవాలనుకుంటున్నారు. అంతా సానుకూలంగా ఉంటే వచ్చే జనవరి నాటికి శాటిలైట్ చానల్ గా రూపాంతరం చెందుతుంది.

తమిళంలో ఫుడ్ ఫుడ్ చానల్ పేరు సమయల్ సమయల్ ( వంట వంట ) గా మారుతుంది. ఈ చానల్ కార్యక్రమాల డబ్బింగ్  ఇప్పటికే వేగం పుంజుకుంది. మార్కెట్ స్పందన  చూసిన తరువాత పూర్తి స్థాయి శాటిలైట్ చానల్ గా ఒరిజినల్ కార్యక్రమాలతో ముందుకెళ్ళాలని నిర్ణయించుకున్నట్టు సంజీవ్ కపూర్ చెబుతున్నారు.