• Home »
  • Cable »
  • పే చానల్స్ చందాల పెంపుకు సుప్రీం ’నో’ : కొత్తరేట్లు చెప్పాలని ట్రాయ్ కి ఆదేశం

పే చానల్స్ చందాల పెంపుకు సుప్రీం ’నో’ : కొత్తరేట్లు చెప్పాలని ట్రాయ్ కి ఆదేశం

పే చానల్స్ తమ చందారేట్లను 27.5 శాతం పెంచుకోవటానికి అవకాశమిచ్చిన ట్రాయ్ ఆదేశాలను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ట్రాయ్ ఇల అవకాశమివ్వటం అర్థరహితమంటూ టిడిశాట్ ఇచ్చిన ఉత్తర్వులను సమర్థించింది. టోకు ధరల సూచికి అనుగుణంగా ఇకమీదట ఎప్పటికప్పుడు చందాలు పెంచుకోవచ్చునంటూ చానల్స్ కు ఇచ్చిన అవకాశాన్ని సైతం సుప్రీంకోర్టు కొట్టివేస్తూ, వీలైనంత త్వరలో కొత్త ధరలు ప్రకటించాలని ఆదేశించింది.

TRAI LOGOఅయితే, ఈ లోపే సన్ గ్రూప్ సహా కొన్ని చానల్స్  ట్రాయ్ చెప్పిన విధంగా పెంచిన రేట్లను అమలు చేయటంతో ఎమ్మెస్వోలు ఇప్పటికిప్పుడు వెనక్కి ఇవ్వాల్సిందిగా కోరవద్దని సుప్రీంకోర్టు సూచించింది. ట్రాయ్ కొత్త రేట్లు వెల్లడించిన తరువాత మాత్రమే ఆ తేడాల సర్దుబాటు అంశాన్ని పరిశీలించవచ్చునని పేర్కొంది. దీంతో 2014 లో ట్రాయ్ జారీచేసిన టారిఫ్ ఆర్డర్ నిర్వీర్యమైంది.  ఆ ఆర్డర్ అర్థరహితమంటూ ఏప్రిల్ 28 న టిడిశాట్ ఇచ్చిన ఉత్తర్వులే నిలబడ్డాయి.

ట్రాయ్ నిరుడు పే చానల్స్ కు అనుకూలంగా ఆదేసాలిస్తూ 27.5 శాతం మేరకు రెండు విడతలుగా చందా రేట్లు పెంచుకోవటానికి అవకాశమిచ్చింది. అదే సమయంలో టోకు ధరల సూచికి అనుగుణంగా చందారేట్లు కూడా పెంచుకోవటానికి అవకాశమిచ్చింది. కేబుల్ ఆపరేటర్లు, ఎమ్మెస్వోలు ఈ ఆదేశాలను సవాలుచేస్తూ టిడిశాట్ ని ఆశ్రయించారు. దీనిని విచారించిన టిడిశాట్ ఈ ఉత్తర్వులు అర్థరహితమంటూ కొట్టివేసింది.

అయితే ఇండియన్ బ్రాడ్ కాస్టింగ్ ఫౌండేషన్, స్టార్ ఇండియా, వయాకామ్ 18, సన్ టీవీ ఈ విషయంలో టిడిశాట్ ఉత్తర్వులు రద్దు చేయాలంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. నిర్మాణ వ్యయాలు బాగా పెరిగిపోయినందున చందాల పెంపుకు అంగీకరించాలని కోరాయి. టారిఫ్ ఆర్డర్ కు ముందు ట్రాయ్ చర్చా పత్రం విడుదలచేసి అభిప్రాయాలు తీసుకున్నందున ఇప్పుడు అడ్డుకోవటం సమంజసం కాదని వాదించాయి. చానల్స్ తరఫున కపిల్ సిబల్, అభిషేక్ మను వాదనలు వినిపించారు.
2014 ఏప్రిల్ నుంచి 15 శాతం, 2015 జనవరి నుంచి 12.5 శాతం పెంచుకోవటానికి ట్రాయ్ అనుమతించింది. అదే విధంగా ఏడేళ్ళుగా పెరగలేదు కాబట్టే అనుమతించినట్టు వివాంణ ఇచ్చింది. ఈ సవరణలకోసం టోకు ధరల సూచినివాడుకున్నట్టు చెప్పుకుంది. నిత్యావసరాల ధరలు 43.69 శాతం పెరగగా, 27.5శాతం చందా పెంపుదలకు అంగీకరించినట్టు చెప్పింది. అయితే, టీవీ నిర్మాణ వ్యయాలకూ, నిత్యావసరాలకూ సంబంధం ఏమిటన్న సుప్రీంకోర్టు ప్రశ్నకు ట్రాయ్ జవాబివ్వలేకపోయింది.