• Home »
  • Content Code »
  • ఎంటర్టైన్మెంట్ చానల్స్ ఫిర్యాదుల మండలికి షర్మిలా టాగూర్ సహా ముగ్గురు సభ్యులు

ఎంటర్టైన్మెంట్ చానల్స్ ఫిర్యాదుల మండలికి షర్మిలా టాగూర్ సహా ముగ్గురు సభ్యులు

టీవీ ప్రసారాల ఫిర్యాదుల మండలిలో ముగ్గురు పాత సభ్యుల స్థానంలో కొత్త సభ్యులు చేరుతున్నారు. టీవీ ప్రసారాల మీద స్వీయ నియంత్రణ కోసం న్యూస్ చానల్స్ ఒక సంస్థను ఏర్పాటు చేసుకోగా ఎంటర్టైన్మెంట్ చానల్స్ యజమానుల సంస్థ అయిన ఇండియన్ బ్రాడ్ కాస్టింగ్ ఫౌండేషన్ (ఐబిఎఫ్) తన ఆధ్వర్యంలో బ్రాడ్ కాస్ట్ కంటెంట్ కంప్లైంట్ కౌన్సిల్ ( బిసిసిసి) పేరుతో ఒక విభాగాన్ని ఏర్పాటు చేసుకున్న సంగతి తెలిసిందే.

ఐబిఎఫ్ సభ్యత్వం ఉన్న చానల్స్ అన్నీ తమ చానల్స్ లో తరచూ స్క్రోల్ ద్వారా ప్రేక్షకులను అప్రమత్తం చేస్తూ, అభ్యంతరకరమైన అంశాలమీద ఫిర్యాదు చేయవచ్చునంటూ పిలిపునివ్వటం తెలిసిందే. అలా అందుకున్న ఫిర్యాదులను విచారించి సలహాల పూర్వకంగానో, మరీ శ్రుతిమించితే దండించటం ద్వారానో అదుపులో ఉంచటానికి బిసిసిసి పనిచేస్తుంది.

ఐబిఎఫ్ అధ్యక్షుడు ఉదయ్ శంకర్ ( స్టార్ ఇండియ చైర్మన్ సీఈవో) అధ్యక్షతన డైరెక్టర్ల బోర్డు సమావేశమై కొత్త సభ్యుల నియామకాన్ని ఖరారు చేసింది.  ప్రముఖ సినీ నటి షర్మిలా టాగూర్, నాటకరంగంలో పేరు మోసిన అరుంధతి నాగ్, సినీ అధ్యయనకారుడు, విద్యారంగ నిపుణుడు అయిన డాక్టర్ ఇరా భాస్కర్ సెప్టెంబర్ లో జరిగే 59 వ సమావేశంలో కొత్త సభ్యులు బాధ్యతలు స్వీకరిస్తారు. ఇప్పటివరకు మూడేళ్ళపాటు బాధ్యతలు నిర్వర్తించిన భాస్కర్ ఘోష్, షబనా అజ్మీ, వీర్ సింఘ్వి స్థానంలో వీరు చేరుతున్నారు.