• Home »
  • Cable/DTH/HITS »
  • తెలుగులో హోం షాపింగ్ చానల్ ’షాప్ సిజె’ : ఏటా రూ. 250 కోట్ల టర్నోవర్ లక్ష్యం

తెలుగులో హోం షాపింగ్ చానల్ ’షాప్ సిజె’ : ఏటా రూ. 250 కోట్ల టర్నోవర్ లక్ష్యం

హోమ్ షాపింగ్ నెట్ వర్క్ రంగం విస్తరణలో భాగంగా షాపింగ్ చానల్ షాప్ సిజె దక్షిణాదికి విస్తరిస్తోంది. ముందుగా తెలుగు రాష్ట్రాలను లక్ష్యంగా చేసుకొని షాప్ సిజె తెలుగులో ప్రారంభిస్తోంది. ఈ ఏడాది రూ. 1200 కోట్ల టర్నోవర్ సాధించిన నెట్ వర్క్ రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి ఏడాదిలో అదనంగా రూ.250 కోట్లు సంపాదించాలన్న లక్ష్యం పెట్టుకుంది.

షాప్ సిజె దేశవ్యాప్తంగా ఆరున్నర కోట్ళ ఇళ్ళకు చేరుకోగా , కేవలం 40 శాతం భూభాగానికి మాత్రమే అందుబాటులో ఉంటూ వచ్చింది. అయితే, ఇప్పుడు తెలుగులో ప్రవేశించి క్రమంగా అన్ని దక్షిణాది రాష్ట్రాలకూ విస్తరించటం ద్వారా కనీసం 80శాతం మంది ప్రజలకు అందుబాటులో ఉండాలని నిర్ణయించుకున్నట్టుషాప్ సిజె నెట్ వర్క్ సీఈవో కెన్నీ షిన్ చెబుతున్నారు.

ముందుగా కేబుల్ ద్వారా ఇంటింటికీ చేరేలా చూస్తున్నప్పటికీ డిటిహెచ్ ప్లాట్ ఫామ్స్ లో త్వరలో సన్ డైరెక్ట్ ద్వారా కూడా పంపిణీ జరిగేట్టు చూస్తామన్నారు. ప్రాంతీయ భాషల్లో 24 గంటల షాపింగ్ అనుభూతి ఇవ్వటానికి ముందుగా తెలుగు రాష్ట్రాలను ఎంచుకున్నామని చెబుతూ ప్రాంతీయ బ్రాండ్లకు ఇందులో మంచి అవకాశముంటుందని గుర్తుచేశారు.

ప్రాంతీయంగా ప్రేక్షకుల అభిరుచికి తగినట్టుగా దేశ వ్యాప్తంగా ఉత్పత్తులు సేకరించటానికి ఎంతగానో పరిశోధన జరిపామని షాప్ సిజె నెట్ వర్క్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ ఎన్. రామకృష్ణన్, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ ధ్రువ చంద్రీ అంటున్నారు.స్వయంగా షాపింగ్ చేస్తున్న అనుభూతి ఇవ్వటానికి స్థానిక భాషలో చేస్తున్న ప్రయోగం విజయవంతమవుతుందని ఆశాభావంతో ఉన్నారు.