• Home »
  • MIB/Licencing »
  • స్వచ్ఛ భారత్ షార్ట్ ఫిల్మ్స్ పోటీ

స్వచ్ఛ భారత్ షార్ట్ ఫిల్మ్స్ పోటీ

పరిసరాల పరిశుభ్రత, తద్వారా ప్రజారోగ్య పరిరక్షణ కోసం ప్రజలలో చైతన్యం కలిగించేలా స్వచ్ఛ భారత్  మీద లఘు చిత్రాలు నిర్మించదలచుకున్నవారికోసం సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ ఒక పోటీ ఏర్పాటు చేసింది. జాతీయ చలన చిత్రాభివృద్ధి సంస్థ ద్వారా సెప్టెంబర్ 10 వరకు ఎంట్రీలు స్వీకరించి వచ్చే అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా విజేతలను సత్కరిస్తారు.

ప్రజల ఆలోచనావిధానంలో మార్పు తీసుకురావటం ద్వారా మాత్రమే స్వచ్ఛ భారత్ పథకాన్ని విజయవంతం చేయగలమని భావిస్తున్న ప్రభుత్వం అందుకు అనుగుణంగా ఈ లఘు చిత్రాల పోటీని ప్రోత్సహిస్తోంది. వివిధ ప్రాంతాలవారు, వివిధ వయోవర్గాలవారు తమ ఆలోచనాలకు తగినట్టుగా చిత్రాలు నిర్మిస్తారని ప్రభుత్వం భావిస్తోంది. అందుకే వయసు పరంగా ఎలాంటి నిబంధనలూ విధించలేదు.

పోటీకి పంపే లఘు చిత్రాలు మూడు నిమిషాల వ్యవధికి మించకుండా హెచ్ డి ఫార్మాట్ లో ఉండాలి. హిందీ, ఇంగ్లీష్ లేదా భారత రాజ్యాంగంలో పేర్కొన్న ఏదేని భారతీయ భాషలో తీయవచ్చు. ఉత్తమ లఘు చిత్రానికి రూ. 10 లక్షలు, రెండవ ఉత్తమ చిత్రానికి రూ.5 లక్షలు చొప్పున మూడింటికి,  ఆరు తృతీయ ఉత్తమ లఘు చిత్రాలకి రూ.2 లక్షల చొప్పున బహుమతిగా అందిస్తారు.

ఆసక్తిగల దరఖాస్తుదారులు జాతీయ చలన చిత్రాభివృద్ధి సంస్థ వెబ్ సైట్ లో వివరాలు చూడవచ్చు. లేదా  sbsff@nfdcindia.com కి రాయవచ్చు.