• Home »
  • Cable »
  • భారీ కొనుగోళ్ళ బాటలో సిటీకేబుల్: కృష్ణ తేజ డిజిటల్ లో 51% వాటా

భారీ కొనుగోళ్ళ బాటలో సిటీకేబుల్: కృష్ణ తేజ డిజిటల్ లో 51% వాటా

సిటీ కేబుల్ కొనుగోళ్ళ బాటలో వేగంగా దూసుకుపోతోంది. గడిచిన ఆర్థిక సంవత్సరంలో ఎన్నో నెట్ వర్క్ లను సొంతం చేసుకోవటమే అందుకు నిదర్శనం. జాతీయ స్థాయి ఎమ్మెస్వోగా ఉంటూ నాలుగు కేబుల్ టీవీ కంపెనీలలో మెజారిటీ వాటా తీసుకోవటంతోబాటు  ఒక సంస్థతో సమాన వాటాతో ఉమ్మడి వ్యాపారానికి ఒప్పందం కుదుర్చుకోగా రెండు సంస్థలను పూర్తిగా కొనుగోలు చేసింది. మరో డీల్ కూదా కుదిరినప్పటికీ ఆఖరిదశ అనుమతులకోసం ఎదురుచూస్తోంది.

వడోదర కు చెందిన సాయి స్టార్ డిజిటల్  డిజితటల్ మీడియా , సిటీ ప్రైమ్ ఉత్తరాంచల్ కమ్యూనికేషన్, పంచ్ శీల్ డిజిటల్ కమ్యూనికేషన్ నెట్ వర్క్, ఆంధ్రప్రదేశ్ కి చెందిన బర్గాచ్ డిజిటల్ కమ్యూనికేషన్  నెట్ వర్క్ లలో సిటీ కేబుల్ 51 శాతం వాటా వాటా తీసుకుంది.  అదేవిధంగా అస్సాం  కేంద్రంగా ఉన్న ఆక్సొమ్ కమ్యూనికేషన్స్ అండ్ కేబుల్ లో సిటీ కేబుల్ 50 శాతం వాటా తీసుకుంది. ఈ ఉమ్మడి వ్యాపార ఒప్పందం ద్వారా వచ్చే రెండేళ్ళలో ఈశాన్యభారతంలో కనీసం 10 లక్షలమంది చందాదారులను సొంతం చేసుకోవాలని లక్ష్యంగా నిర్ణయించుకుంది.

సిటీ కేబుల్ పూర్తిగా సొంతం చేసుకున్న నెట్ వర్క్స్ లో వెరైటీ ఎంటర్టైన్మెంట్, కోల్ కతా కు చెందిన ఇండినెట్ సర్వీస్ ఉన్నాయి. ముంబయ్ కేంద్రంగా ఉన్న యు స్కాడ్ 18 సంస్థతో ఒప్పందం దాదాపుగా పూర్తి కావస్తోంది. యు స్కాడ్ 18 లో 76శాతం వాటా తీసుకోవటానికి సిటీ కేబుల్ సిద్ధమైనట్టు తెలుస్తుండగా ఒప్పందం విలువ మాత్రం వెల్లడి కాలేదు. ఇలా ఉండగా సిటి సిరి డిజిటల్ నెట్ వర్క్, సాయి స్టార్ డిజిటల్ మీడియా, వెరైటీ ఎంటర్టైన్మెంట్, సిటి బ్రాడ్ బాండ్ సర్వీసెస్ లో ఆప్షనల్లీ కన్వర్టిబుల్ డిబెంచర్లు తీసుకుంది. ఈ రూపంలో మొత్తం రూ. 134 కోట్ల 66 లక్షల రూపాయలు, ఈక్విటీ వాటాల రూపంలో 7 కోట్ల 2 లక్షలు పెట్టుబడి పెట్టింది.

జనవరిలో సిటీకేబుల్ చేసిన ప్రకటన ప్రకారం బర్గచ్ ఎంటర్టైన్మెంట్ లో 51 శాతం వాటా తీసుకుంది. వెరైటీ ఎంటర్టైన్మెంట్ లో 100 శాతం వాటాకు గాను కోటీ యాభై లక్షలు చెల్లించటానికి ఒప్పుకుంది. అయితే, ఇంకా లెక్కలు, సర్దుబాట్లు పూర్తి కానందున సాయి స్టార్ డిజిటల్ మీడియాలో 51 శాతం వాటా విలువను లెక్కించటం ఒక కొలిక్కి రాలేదు. ఈ మూడే కాకుండా మరో నాలుగు కేబుల్ కంపెనీలను కొనుగోలు చేస్తున్న విషయాన్ని కూడా సిటీ కేబుల్ వెల్లడించింది. వాటిలో యు స్కాడ్ 18 కూడా ఉంది.

తిరుపతి కేంద్రంగా ఉన్న కృష్ణ తేజ డిజిటల్ ఎంటర్టైన్మెంట్ లో కూడా కంపెనీకి 51 శాతం వాటా ఉన్నట్టు సిటీ కేబుల్ పేర్కొంది. న్యూ ఢిల్లీ కేంద్రంగా పనిచేసే సిటి ఫాక్షన్, సిటీ జానీ డిజిటల్ కేబుల్ నెట్ వర్క్ లో మిగిలిన 49 శాతం వాటా కొనుక్కోవటానికి కూడా సిటీ కేబుల్ ఒప్పుకుంది. ఈ రెండు సంస్థల మిగిలిన వాటాకోసం రూ. 5 కోట్లు చెల్లించాల్సి ఉంది.

2015-16 ఆర్థిక సంవత్సరంలో సిటీ కేబుల్ మొత్తం 27 లక్షల డిజిటల్ చందాదారులను కలుపుకోగలిగింది. దీంతో సిటీబుల్ మొత్తం డిజిటల్ చందాదారుల సంఖుఅ 79 లక్షలకు చేరింది. క్రమంగా పెంచుకుంటూ పోవటం కాకుండా మహారాష్ట్ర, గుజరాత్, ఒడిశా, అస్సాం తదితర రాష్ట్రాలలో పెద్ద ఎత్తున స్థానిక  నెట్ వర్క్ ల కొనుగోలు చేపట్టటం ద్వారా ఈ అభివృద్ధి సాధించింది.