• Home »
  • Cable »
  • సిటీ కేబుల్ ఆధ్వర్యంలో యోగా దినోత్సవం

సిటీ కేబుల్ ఆధ్వర్యంలో యోగా దినోత్సవం

SITI CABLE

అంతర్జాతీయ యోగాదినోత్సవాన్ని పురస్కరించుకొని జీ గ్రూపు వారి సిటీ కేబుల్ ఈ నెల 21 న ప్రత్యేక  కార్యక్రమం చేపట్టింది. ప్రజలలో యోగా పట్ల అవగాహన పెంచటాన్ని సామాజిక బాధ్యతగా భావిస్తున్నట్టు  సిటీ కేబుల్ నెట్ వర్క్ లిమిటెడ్ ఒక ప్రకటనలో పేర్కొంది. నగర ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొనాలని విజ్ఞప్తి  చేసింది.

21వ తేదీ ఉదయం 9 గంటలకు హైదరాబాద్ లోని చాపెల్ రోడ్ ( నాంపల్లి ) లో ఉన్న రెడ్ రోజ్ పాలెస్  ఫంక్షన్ హాల్ లో ఈ కార్యక్రమం జరుగుతుందని, గాంధీ జ్ఞాన్ మందిర్ యోగా కేంద్రం డైరెక్టర్ ప్రవీణ్  కపాడియా శిబిరాన్ని నిర్వహిస్తారని సిటీ కేబుల్ తెలియ జేసింది.