• Home »
  • International Channels »
  • స్టార్ ఇండియా సీఈవో కు చైర్మన్ పదవి, దక్షిణాది చానల్స్ కి ఎండీ గా మాధవన్

స్టార్ ఇండియా సీఈవో కు చైర్మన్ పదవి, దక్షిణాది చానల్స్ కి ఎండీ గా మాధవన్

స్టార్ ఇండియా ఉన్నతాధికారగణంలో ఈ రోజు అత్యంత కీలకమైన మార్పులు ప్రకటించింది.  సీఈవోగా విజయాలు సాధించిన ఉదయ శంకర్ కు చైర్మన్ గా పదోన్నతి కల్పించారు. ఆయన ఇక మీదట సీఈవో, చైర్మన్ బాధ్యతలు నిర్వహిస్తారు. అదే విధంగా ఇప్పటివరకు సీవోవోగా ఉన్న సంజయ్ గుప్త ఎండీగా పదోన్నతి పొందారు.

దక్షిణాది రాష్ట్రాల పూర్తి బాధ్యతలు కె మాధవన్ కు అప్పగించారు. స్టార్ కొనుగోలు చేసిన ఈ చానల్స్ ను మరింతగా అభివృద్ధి చేసే బాధ్యతలు ఆయనకు అప్పగించినట్టు పేర్కొంటూ ఉదయశంకర్ ఆదేశాలకు అనుగుణంగా పనిచేయాలని సూచించారు.  అయితే, అదే సమయంలో దక్షిణాదికి సీఈవోగా కెవిన్ వాజ్ ను నియమించారు.  తమిళనాడు, కర్నాటక, కేరళ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల బాధ్యతలు నిర్వర్తిస్తూ ఆయన మాధవన్ ఆదేశాలకు అనుగుణంగా నడుచుకుంటారు